‘జయ జానకి నాయక’ ఇది బోయపాటి సినిమానేనా?

బెల్లంకొండ శ్రీనివాస్-బోయపాటి శ్రీను కాంబినేషన్లో మొదలైన కొత్త సినిమాకు సంబంధించిన ఎప్పుడో పోయినేడాది ఆఖర్లో ఒక ప్రి లుక్ రిలీజ్ చేశారు. తర్వాత చాలా విరామం తర్వాత ఈ మధ్యే టైటిల్ లోగో లాంచ్ చేశారు. అవి రెండూ పాజిటివ్ రెస్పాన్సే తెచ్చుకున్నాయి.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘జయ జానకి నాయక’ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. బెల్లంకొండ శ్రీనివాస్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు చిత్ర యూనిట్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. రోడ్డు పక్కగా నిలిపిన బైక్‌ దగ్గర రకుల్‌ నిల్చొని చూస్తుండగా.. శ్రీనివాస్‌ నవ్వుతూ ఓ పక్కకు వేలు చూపిస్తున్నట్లుగా ఉన్న పోస్టర్‌ను ఫస్ట్‌లుక్‌‌గా విడుదల చేశారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. జగపతిబాబు, వాణీ విశ్వనాథ్, సితార తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

‘కంచె’ ఫేమ్ ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ‘జయ జానకి నాయక’ సినిమాను కుటుంబ కథాచిత్రంగా రూపొందిస్తున్నట్లు నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి తెలిపారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *