Video: పెళ్లిలో నవవధువును ముద్దాడిన వరుడి తండ్రి

బీజింగ్: చైనాలో పెళ్లి తంతు అంటే ఏదైనా వింత సంఘటన లేకుండా జరగదు. ఏదో వింత పందాలు కట్టుకుని వివాహానికి వచ్చిన వారిని ఆశ్చర్యానికి గురిచేస్తారు. తాజాగా, కొడుకు పెళ్లిలో నవవధువును ముద్దాడి ఓ వ్యక్తి సంచలనంగా మారాడు. అయితే, దీనికి పందెం కాయడమే కారణం. వివరాల్లోకి వెళితే.. చైనాలోని హెనెన్‌ రాష్ట్రంలోని ఓ గ్రామంలో ఎంతో వైభవంగా వివాహ వేడుకలు జరుగుతున్నాయి. పెళ్లికూతురు, పెళ్లి కొడుకు బంధువులు, స్నేహితులు కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ నేపథ్యంలో పెళ్లికొడుకు తండ్రితో ఒక బంధువు పందెం వేశాడు. పెళ్లి కూతుర్ని ముద్దుపెట్టుకోవాలని, అలా చేస్తే 10వేల యువాన్లు నీవేనంటూ పందెం కాశాడు. అందుకు పెళ్లికొడుకు తండ్రి సిద్ధమని చెప్పి.. వెంటనే పెళ్లికూతురి వద్దకి వెళ్లి ఆమెను 17 సెకన్లపాటు ముద్దాడాడు. దీంతో వేడుకకు వచ్చిన వారంతా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే తేరుకుని చప్పట్లు కొడుతూ నవ్వులు పూయించారు.

పెళ్లి కూతురు కూడా మొదట కంగారుపడినా తర్వాత తేరుకుని నవ్వేసింది. కాగా, పోటీలో గెలిచావంటూ సదరు వ్యక్తి వచ్చి పెళ్లికొడుకు తండ్రికి నగదు అందజేశాడు. అయితే, ఈ తతంగాన్నంతా అక్కడున్న వారు ఎవరో వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో పలువురు నెటిజన్లు పెళ్లికొడుకు తండ్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, చైనాలో వివాహ వేడుకల్లో వధూవరులను ఉత్సాహ పరిచేందుకు అతిథులు ఆటపాటలు, పందేలు నిర్వహిస్తుంటారు. పలు సందర్భాల్లో వధూవరులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడటం గమనార్హం. అయినా, అక్కడ ఈ సంస్కృతి మాత్రం మారడం లేదు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *