బాల‌య్య సినిమాకు నాలుగో పేరూ బ‌య‌ట‌కొచ్చింది

గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి చిత్రం త‌ర్వాత నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తోన్న చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం పోర్చుగ‌ల్‌లో ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. మొన్నా మ‌ధ్య రిస్కీ యాక్ష‌న్ స‌న్నివేశాల్ని డూప్ లేకుండా చేసిన వైనం ఈ సినిమా మీద కొత్త ఆస‌క్తిని తీసుకొచ్చింది.

బాల‌య్య చేసిన సాహ‌సానికి ఆయ‌న ప‌క్క‌నే ఉన్న శ్రియ సైతం షాక్ తిన్న‌ట్లుగా చెప్ప‌టం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఓ ప‌క్క సినిమా షూటింగ్ వేగంగా సాగుతున్నా.. టైటిల్ విష‌యంలో ఒక నిర్ణ‌యానికి రాలేక‌పోతున్నార‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే మూడు పేర్లు అనుకున్నా.. సంతృప్తి చెంద‌టం లేద‌ట‌. పూరీ ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య చేస్తున్న ఈ చిత్రానికి ఆయ‌న మార్క్ పేర్ల‌కు భిన్నంగా.. బాల‌య్య ఇమేజ్‌కు త‌గ్గ‌ట్లుగా పేర్ల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

జై బాల‌య్య‌.. ఉస్తాద్‌.. తేడా సింగ్ ఇప్ప‌టివ‌రకూ ఈ సినిమాకు అనుకున్న పేర్లు. తాజాగా మ‌రో పేరు ఈ జాబితాలోకి వ‌చ్చి చేసింది. పైసా వ‌సూల్ గా నాలుగో పేరు అనుకుంటున్న‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. మ‌రీ నాలుగుపేర్ల‌లో ఒక‌టి ఫిక్స్ చేస్తారా? లేదా.. మ‌రో పేరు మీద ఫోక‌స్ చేస్తారా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. ఈ నెల 10న బాల‌య్య బ‌ర్త్ డే సంద‌ర్భంగా అయినా సినిమా పేరును అనౌన్స్ చేస్తే బాగుంటుంద‌ని ఫ్యాన్స్ ఫీల‌వుతున్నా.. సినిమాకు త‌గ్గ పేరు మాత్రం ఇంకా రాలేద‌ని బాల‌య్య అండ్ కో భావిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *