చంద్రయాన్ -2 ఆగడానికి కారణమిదే…

శ్రీహరికోట: భారత అంతరిక్షా పరిశోదన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా గత పదేళ్ళపాటు కఠోర శ్రమతో చేపట్టిన జాబిల్లి యాత్ర చంద్రయాన్-2 సాంకేతిక లోపం వల్ల ఆదివారం అర్థరాత్రి ఆగిపోయింది. సోమవారం తెల్లవారుజామున 2.51 నిమిషాలకు వాహనౌక  జీఎస్‌ఎల్‌వీ-3 ఎం-1 లో సాంకేతిక లోపం తలెత్తడంతో చంద్రయాన్-2 ప్రయోగాన్ని నిలిపివేసినట్టు ఇస్రో ప్రకటించింది. ఆదివారం ఉదయం 6.51 నిమిషాలకి ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్ ఆధ్వర్యంలో  కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ప్రయోగ సమయానికి 56 నిమిషాల 24 సెకన్ల ముందు కౌంట్‌డౌన్‌ నిలిపివేశారు. 19.4గంటలపాటు నిర్వహించిన కౌంట్ డౌన్ సమయంలో ఎల్-110 దశలో 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపారు. తరువాత సీ-25 దశలో అంటే మూడో దశలో ద్రవ ఆక్సిజన్, ద్రవ హైడ్రోజన్ ఇంధనాన్ని నింపే ప్రక్రియను విజయవంతంగా చేపట్టారు.  కానీ ప్రయోగానికి 56.24 నిమిషాల ముందు కౌంట్ డౌన్ నిలిపివేశారు. మళ్ళి ఎప్పుడు జరిపేది త్వరలోనే తెలుపుతామని ఇస్రో అధికారులు చెప్పారు.

రాకెట్ లో కీలక దశగా భావించే క్రయోజనిక్ దశలో గ్యాస్‌ బాటిల్‌ (పోగో బాటిల్‌) లీకేజీ వల్ల ప్రయోగాన్ని అర్ధంతరంగా నిలిపేశారు. క్రయోజనిక్‌ ఇంజన్‌లకు అతిముఖ్యమైన పోగో గ్యాస్‌ బాటిల్స్  గ్యాస్‌ లీకేజీ జరిగితే ఇంజన్లకు తగిన థ్రస్ట్‌ రాదని ప్రయోగాన్ని నిలిపివేశారు. ఎస్‌–200 బూస్టర్లు,  ఎల్‌–110 దశలో బాగా పనిచేసినా సీ–25 దశలో వేగం రాదని కౌంట్‌డౌన్‌ ను శాస్త్రవేత్తలు నిలిపివేశారు. కొందరు నిపుణులు క్రయోజెనిక్ ఇంజన్ లో ఇంధనం లీకేజీ కారణంగానే ప్రయోగం వాయిదా పడిందని అంటున్నారు. రాత్రికి రాత్రే క్రయోజెనిక్ దశలో 25 టన్నుల ద్రవ ఆక్సిజన్, ద్రవ హైడ్రోజన్ ఇంధనాన్ని వెనక్కి తీసి, అందులో అడుగు భాగాన పక్కన అనుకోని  వున్న ఇంధన పొరలను తొలగించడానికి నైట్రోజన్ వ్యాపార్స్ ను లోపలకు పంపించి శుబ్రం చేయాల్సి వుంది. రాకెట్ ను విడివిడి భాగాలుగా మొత్తం విడదీసి మళ్ళి అసెంబ్లింగ్ చేయాల్సి ఉండడంతో ఈ ప్రయోగం ఏడాది చివరి వరకు పడుతుందని అంచనా. మొదటిసారి జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–ఎం1 రాకెట్‌లో క్రయోజనిక్‌ దశలో సాంకేతిక లోపం తలెత్తడం ఇదే కావడంతో దీనిపై పట్టు సాధించేందుకు శాస్త్రవేత్తలు మొదలుపెట్టారు. ఇస్రో చైర్మన్ డాక్టర్ కె. శివన్ అధ్వర్యంలో ఈ లోపం ఎలా జరిగిందనే దానిపై అధ్యయనం చేస్తున్నారు.

జీఎస్‌ఎల్‌వీకి చంద్రయాన్‌–2 కేవలం నాలుగో ప్రయోగం.  చంద్రయాన్‌–1 తర్వాత ఇస్రో సొంతంగా తయారుచేసిన క్రయోజనిక్‌ ఇంజన్‌ సాయంతో జీశాట్‌–4 ఉపగ్రహాన్ని ప్రయోగించే ప్రయత్నం చేసింది. కానీ ఇంజన్‌ ఆన్‌ కాకపోవడంతో రాకెట్‌ సముద్రంలో కూలిపోయింది. తర్వాత చేసిన మూడు ప్రయోగాలు విజయవంతం కావడంతో చంద్రయాన్‌–2కు ఈ రాకెట్‌ను ఎంపిక చేశారు. అయితే క్రయోజనిక్‌ ఇంజన్‌ నుంచి అతిశీతల పరిస్థితుల్లో ఉండే ఇంధనం లీక్‌ కావడం, ఇంజన్‌లోని కొన్ని వాల్వ్‌లు సక్రమంగా పనిచేయకపోవడాన్ని గుర్తించడం వల్ల ప్రయోగాన్ని ఆపేశారని కొంతమంది నిపుణుల అంచనా. ‘అంత పెద్ద ప్రయోగంలో చిన్నచిన్న సమస్యలు సహజమే. సమస్య ఉందని గుర్తించాక ఏ మాత్రం అవకాశం తీసుకోకూడదు’అని డీఆర్‌డీవో శాస్త్రవేత్త రవిగుప్తా అన్నారు. ‘ప్రయోగం కోసం దాదాపు రూ.వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *