నిత్యానందపై ఆరోపణలు

పిల్లలను కిడ్నాప్ చేసి, తప్పుగా నిర్బంధించినందుకు అమ్మాయిలతో బలవంతపు విరాళాలు వసూలు ఇప్పటికే ఎదుర్కొంటున్న నిత్యానందపై మరోసారి తీవ్ర ఆరోపణలు చెలరేగాయి. బెంగళూరులోని త్రిచికి చెందిన ఝాన్సీరాణి కుమార్తె సంగీత అర్జునన్2008 – 2014 కాలంలో నిత్యానంద ఆశ్రమంలో కంప్యూటర్ విభాగానికి హెడ్‌గా పనిచేసేది. ఆశ్రమంలో చాలా దారుణ పరిస్థితుల్లోఆమెను ఇంటికి తీసుకొచ్చానని. వెంటనే నలుగురు వ్యక్తులు వచ్చితనమీదే కేసు పెడతామని బెదిరించి బలవంతంగా సంగీతను తీసుకెళ్లారని… డిసెంబర్28, 2014 [ఆమె వయసు 24] నాటికి సంగీత  చనిపోయిందని అంత్యక్రియలు కూడా ఆశ్రమంలోనే చేయాలని గట్టిగా ప్రయత్నించి విఫలమయ్యారని . కుమార్తె మృతదేహాన్ని ఇంటికి తీసుకురావాలని పట్టుబడితే …     పోస్ట్‌మార్టం జరిగిందని కాళ్లపై వాపు, బ్లడ్‌ క్లాట్స్‌.. రెండవసారి పోస్ట్‌మార్టంలో ఆమె శరీరంలోని అవయవాలన్నీ మాయమయ్యాయని  శవపరీక్షలో వాటిని తొలగించినట్టు గత ఏడాది హైకోర్టు జడ్జికి తెలిపారన్నారు. కర్ణాటక కోర్టులో కేసు వేసి ఐదేళ్ళు అయ్యింది. గత ఏడాది ఈ కేసులో సీబీఐకి అప్పగిస్తున్నట్టు చెప్పారు. కానీ ఆ తరువాత పదిరోజుల్లోనే ఆ సదరు న్యాయమూర్తి బదిలీ అయ్యారు. దీంతో విచారణలో ఎలాంటి పురోగతి లేదని, ఈ నేపథ్యంలో తక్షణమే  స్పందించి బీఐతో విచారణ జరిపించాలని ఆమె డిమాండ్‌ చేశారు. నిత్యానందపై గత వారం కేసు నమోదైంది. అయితే నిత్యానంద దేశం విడిచి పారిపోయాడని పోలీసులు  ప్రకటించిన సంగతి తెలిసిందే.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *