‘చికెన్, ఎగ్ మేళా’ ఉచితంగా పంపిణీ

నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ‘చికెన్, ఎగ్ మేళా’ నిర్వహిస్తున్నారు. 6 వేల కిలోల చికెన్‌తో పాటు కోడిగుడ్లతో చేసిన స్నాక్స్‌ను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. కోడి మాంసంతో కరోనా వైరస్ సోకదనే విషయాన్ని చెప్పడానికి ఈ మేళా తలపెట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్, తెలంగాణ పౌల్ట్రీ బీడర్స్ అసోసియేషన్, నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీతో పాటు ఇతర ప్రైవేట్ కంపెనీలు చికెన్, ఎగ్ మేళాను నిర్వహిస్తున్నాయి. శుక్రవారం (ఫిబ్రవరి 28) సాయంత్రం 4 గంటల నుంచి పీపుల్స్‌ ప్లాజాలో ఈ మేళాను నిర్వహిస్తున్నట్లు పౌల్ట్రీ సమాఖ్య వెల్లడించింది.ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే ఇదే సమయంలో కరోనా వైరస్‌పై పలు వదంతులు వ్యాప్తి చెందుతున్నాచికెన్‌ తింటే కరోనా వైరస్ సోకుతుందని సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ దెబ్బకు కోడి మాంసం అమ్మకాలు సగానికి సగం పడిపోయాయి. దేశవ్యాప్తంగా వారానికి సగటున 7.5 కోట్ల కోళ్ల అమ్మకాలు జరుగుతుండగా.. ప్రస్తుతం 3.5 కోట్ల కోళ్లు మాత్రమే అమ్ముడవుతున్నాయి. ఫలితంగా పౌల్ట్రీల్లో కోడి ధర 70% వరకు పతనమైంది. కిలో కోడి ధర రూ.100 నుంచి రూ.30-35కి పడిపోయింది. ఇదే సమయంలో కోడి బరువు కిలో పెరిగేందుకు ఖర్చు రూ.75 అవుతోందని పౌల్ట్రీ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.డిమాండ్ తగ్గడంతో చికెన్ ధరలు భారీగా తగ్గిపోయాయి. ప్రస్తుతం కిలో చికెన్ ధర రూ. 80 నుంచి రూ.120 మధ్య ఉంది. వివాహాది శుభకార్యాల్లోనూ కోడి మాంసం వినియోగించడానికి పలువురు సంశయిస్తున్నారు. చికెన్‌, గుడ్డు వినియోగం విషయంలో సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న వదంతులను నమ్మొద్దని విజ్ఞప్తి చేశాయి. దీనిపై వినియోగదారుల్లో అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్‌ పీపుల్స్‌ ప్లాజాలో ‘చికెన్‌, ఎగ్‌ మేళా’ నిర్వహిస్తున్నట్లు వెల్లడించాయి. మేళాలో 6 వేల కిలోల చికెన్‌తో పాటు గుడ్లతో తయారుచేసిన రుచికరమైన స్నాక్స్‌ వినియోగదారులకు ఫ్రీగా పంపిణీ చేయనున్నట్లు తెలిపాయి.

ప్రధాన ఆకర్షణగా హీరోయిన్ రష్మిక
శుక్రవారం సాయంత్రం ‘చికెన్, ఎగ్ మేళా’ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. మంత్రులు ఈటల రాజేందర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రష్మిక మందాన కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని నెక్‌ సభ్యుడు జి రాంరెడ్డి తెలిపారు. 12 వేల మంది సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *