‘ఉయ్యాలవాడ’ కోసమేనా ఈ గెటప్‌.?

చిరంజీవి చైనా యాత్ర ముగిసింది.. ఇటీవల కన్నుమూసిన దర్శకరత్న దాసరి నారాయణరావుకి తెలుగు సినీ పరిశ్రమ ఘనంగా సంతాపం ప్రకటిస్తూ, ఓ కార్యక్రమాన్ని నిర్వహఙంచింది. ఆ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్నారు. దాసరితో తన అనుబంధాన్ని చిరంజీవి గుర్తు చేసుకున్నారు.

దాసరిని కడసారి చూసుకునే అవకాశం దక్కకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, చివరిసారి తనకు దాసరి ఆశీస్సులు దక్కిన విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు.

ఇదిలా వుంటే, ఈ కార్యక్రమంలో అందరి దృష్టీ చిరంజీవి మీదనే పడింది. కారణం, చిరంజీవి సరికొత్త లుక్‌తో కన్పించడమే. తన తాజా చిత్రం ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ సినిమా కోసం చిరంజీవి ప్రిపేర్‌ అవుతున్నట్లు ఆయన గెటప్‌ చెప్పకనే చెబుతోంది.

తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కిస్తున్న విషయం విదితమే. రామ్‌చరణ్‌ నిర్మించనున్న ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకుడు.

చిరంజీవి తాజా గెటప్‌ చూసి, ఇదే ఉయ్యాలవాడలో చిరంజీవి కన్పించబోయే గెటప్‌.. అని సోషల్‌ మీడియాలో అభిమానులు ఈ ఫొటోల్ని షేర్‌ చేసేస్తున్నారు. ఇదెంతవరకు నిజం.? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే.

ఆగస్ట్‌లో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమవుతుంది. మరోపక్క, ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ సినిమాని ప్రస్తుతానికి కాస్త పక్కన పెట్టి, ఓ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ చేయాలన్న ఆలోచన కూడా చిరంజీవికి వుందన్న గుసగుసలు విన్పిస్తున్న విషయం విదితమే.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *