‘ఉయ్యాలవాడ..’ మొదలైంది..!

ఖైదీ నంబర్ 150తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. లాంగ్ గ్యాప్ తరువాత తన నెక్ట్స్ సినిమాను మొదలు పెట్టాడు. చాలా రోజులుగా ఊరిస్తున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా ఈ రోజు (బుధవారం) కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఆఫీస్ లో లాంఛనంగా ప్రారంభమైంది. ముందుగా ఆగస్టు 22న చిరు పుట్టిన రోజు సందర్భంగా సినిమా ప్రారంభించాలని ప్లాన్ చేసినా.. సరైన ముహూర్తం కుదరకపోవటంతో ముందే ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి దంపతులు.. చిత్ర నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి, రచయితలు పరుచూరి బ్రదర్స్, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పాల్గొన్నారు. బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రూపొందిస్తున్నారు. ఆగస్టు 22న చిరు పుట్టిన రోజు సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *