మెగా ఫ్యామిలీ నుంచి మరో కళ్యాణ్

గతేడాది ప్రారంభంలో మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురును వివాహమాడిన కుర్రాడి పేరు కళ్యాణ్. చిరు చిన్నల్లుడు హీరో మెటీరియల్ లా కనిపించడంతో.. అప్పట్లోనే ఇతడి ఫిలిం ఎంట్రీపై గుసగుసలు వినిపించాయి. కానీ స్వతహాగా వ్యాపారవేత్త అయిన కళ్యాణ్.. సినిమాలపై తనకు ఆసక్తి లేదని చెప్పేయడంతో.. మళ్లీ ఇలాంటి వార్తలు వినిపించలేదు.

అయితే.. చిరంజీవి అల్లుడి సినిమా ఎంట్రీ ఖాయమే అనే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తోంది. ఇందుకు సంబంధించి పక్కా ప్లాన్ తో వ్యవహరిస్తోందట మెగా ఫ్యామిలీ అంతా. ప్రత్యేకించి మెగాస్టార్ ఈ విషయంలో చాలానే కేర్ తీసుకుంటున్నారట. అరంగేట్రంలో అల్లుడు అదిరిపోయే హిట్ కొట్టేసి.. గ్రాండ్ ఎంట్రీ ఇప్పించాలని భావిస్తున్నారని తెలుస్తోంది.  ఇందుకోసం స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇప్పటికే పూర్తి చేసేసుకున్నాడట కనుగంటి కళ్యాణ్. స్టార్ మేకర్ గా గుర్తింపు పొందిన సత్యానంద్.. ఇప్పటికే పవన్ కళ్యాణ్.. మహేష్ బాబు.. రవితేజ.. జయం రవి.. వరుణ్ తేజ్ వంటి అనేక మంది హీరోలకు ట్రైనింగ్ ఇచ్చి.. సక్సెస్ ఫుల్ యాక్టర్స్ గా తీర్చిదిద్దాడు.

ఈయన దగ్గర కళ్యాణ్ కు కూడా మూడు నెలల పాటు స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించిన చిరంజీవి.. దగ్గరుండి మరీ ప్రోగ్రెస్ ను పరిశీలించారట. థియేట్రికల్ కాన్సెప్ట్స్.. సిట్యుయేషన్స్.. డైలాగ్స్.. ఎక్స్ ప్రెషన్స్.. వాయిస్.. డిక్షన్ ఇలా అనేక రకాల అంశాలపై ట్రైనింగ్ పూర్తి చేశాడని.. మెగాస్టార్ అల్లుడు అంటూ బీరాలు పోకుండా.. ఎంతో శ్రద్ధగా ఈ కోర్సును కంప్లీట్ చేశాడని అంటున్నారు. త్వరలోనే ఇతడి సినిమా పనులు మొదలైపోయే అవకాశాలున్నాయని టాక్.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *