బ‌రి తెగించేసిన స‌మంత‌-చైతు

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ‌చైత‌న్య – సౌత్ ఇండియ‌న్ స్టార్ హీరోయిన్ సమంత ప్రేమాయ‌ణం – పెళ్లి వార్త‌లు ఎంత సంచ‌ల‌నం రేపాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. వీరిద్ద‌రు వ‌చ్చే యేడాది పెళ్లీ పీఠ‌లు ఎక్క‌నున్నారు. వీరి ప్రేమ‌కు నాగార్జున కూడా గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేయ‌డంతో వీరు ప‌బ్లిక్‌గానే ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించేస్తున్నార‌న్న గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి.

ఇక వీరిద్ద‌రి వ్య‌వ‌హారం చిన్న చిన్న పార్టీలకు, ఇతర కార్యక్రమాలకు హాజరవ‌డం వ‌ర‌కే కాకుండా స‌హ‌జీవ‌నం చేసే వ‌ర‌కు వెళ్లిపోయింద‌ని తెలుస్తోంది. ఇప్పుడు వీరిద్ద‌రు సీక్రెట్‌గా స‌హ‌జీవ‌నం చేస్తున్నార‌ట‌. ఈ వార్త ఇండస్ట్రీ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో జోరుగా హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

ఇటీవల చైతూ పుట్టిన రోజు సందర్భంగా ఏకాంతంగా కలుసుకున్న ఫొటోలను కూడా సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. అయితే, తాజాగా ఈ జంట ఒక పార్టీలో విచ్చలవిడిగా చిందేస్తూ మస్తుగా ఎంజాయ్ చేస్తున్న ఫొటోను సమంత అప్‌లోడ్ చేయడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

పెళ్లి కాకుండానే సంప్రదాయబద్ధంగా పార్టీలకు, ఫంక్షన్లకు హాజరు కావడంపై అంతగా దృష్టి సారించని సినీ ప్రేమికులు ఈ జంట ఇలా పబ్లిగ్గా పార్టీలో అర్థరాత్రి చిందులేస్తూ ఎంజాయ్ చేయడం గురించి ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్న వీరు ఇలా అర్ధ‌రాత్రి పార్టీల్లో ఎంజాయ్ చేయ‌డం ఏంటా అని విమ‌ర్శ‌లు కూడా సంధిస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *