ఎన్టీఆర్ బిగ్‌బాస్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? టాలీవుడ్ హీరోలు కుళ్లుకునేంతగా..

సిల్వర్ స్క్రీన్‌పై తడాఖా చూపించిన అగ్రహీరోలు నాగార్జున, చిరంజీవి బుల్లితెర మీద తమ హవాను సక్సెస్‌పుల్ కొనసాగించారు. ప్రస్తుతం వారిద్దరి తర్వాత ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్‌బాస్‌తో టెలివిజన్ ప్రేక్షకులకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. జాతీయ స్థాయిలో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా ఇప్పటికే క్రేజీ రియాలిటీ షోగా మారిన బిగ్‌బాస్ షోను తెలుగులో ఎన్టీఆర్ చేస్తున్నారనే సరికి భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ షోను చేయడానికి ఎన్టీఆర్ ఎంత తీసుకొన్నారు? స్టార్ మా టెలివిజన్ ఎన్టీఆర్‌ను ఈ షో కోసం ఒప్పించడానికి ఏ మేరకు భారీ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ముందుకు వచ్చారనే ప్రశ్నలు మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. అయితే ఎన్టీఆర్ మాత్రం దక్షిణాదిలో ఏ హీరో తీసుకోనంత మొత్తాన్ని ఈ షో కోసం తీసుకొన్నాడనేది సినీవర్గాల్లో చర్చ జరుగున్నది.

ఇంకా జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఎన్టీఆర్ సమాధానమిస్తూ మీరు అనుకునేంత మాత్రం కాదు అని చెప్పారు. మీరు ఇలా అడుతుంటే నాకు ఎంత ఇచ్చారో అనే విషయాన్ని ఇంటికి వెళ్లి ఆలోచించాలి అని అన్నారు. ఇలా తన రెమ్యునరేషన్‌పై ఎన్టీఆర్ చాలా తెలివిగా దాటవేసే ప్రయత్నం చేశారు. కానీ తెలుగు హీరోలకు దిమ్మతిరిగే రెమ్యునరేషన్ ఇచ్చారనేది ఇన్‌సైడ్ టాక్.

బిగ్‌బాస్ తెలుగు వెర్షన్ రియాలిటీ షో కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తీసుకొన్న పారితోషికం అనధికారికంగా సుమారు రు.25 కోట్లు మొత్తం ఉండవచ్చనేది తాజా సమాచారం. ఈ మొత్తం ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది కానీ, తక్కువ ఉండటానికి అవకాశం లేదని పలువురు బల్లగుద్ది చెప్తున్నారు. ఎన్టీఆర్ తీసుకొన్న రెమ్యునరేషన్ మాత్రం ఇండస్ట్రీ ప్రముఖులకు నిద్ర లేకుండా చేస్తున్నదనే విషయం ఫిలింనగర్ విస్తృతంగా ప్రచారం అవుతున్నది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *