గెలిచినా, ఓడినా భారత్ మీ వెంటే

ఇంగ్లాండ్ లో జరుగుతున్న ప్రపంచ కప్ సెమీఫైనల్లొ న్యూజిలండ్ జట్టుతో ఆడిన భారత్ జట్టు ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కాని వరల్డ్ కప్ లాంటి పెద్ద సంధర్భాలలొ ఇంతకు ముందు భారత్ ఓడినప్పుడు అభిమానుల రియాక్షన్ వేరేలా ఉండేది.

2013 వరల్డ్ కప్ సమయంలో, లీగ్ దశలోనే భారత్ నిష్క్రమించినప్పుడు, అభిమానులు కొంతమంది ఆటగాళ్ళ ఇళ్ళపై రాళ్ళు విసిరారు. ఇక 2007 లో అయితే.. ఏకంగా రోడ్లపైకి వచ్చి ఆటగాళ్ళ ఫోటోలకు నిప్పు అంటించారు.

కానీ ఇపుడు అలా ‌కాదు అభిమానులు మారారు. మెచ్చురుటిని ప్రదర్శించారు.  లీగ్ దశలో పాయింట్ల పట్టికలో.. ప్రధమ స్థానంలో నిలిచి, సెమీ ఫైనల్లోకి ప్రవేశించిన భారత్ ఎలాంటి పరిస్థితుల్లో.. ఓడిందో సగటు అభిమానికి బాగ తెలుసు. ఓటమి, బాధను కలిగించినప్పటికీ దాన్ని హుందాగా స్వీకరించారు. ఆట చివరిలో, చివరి వరల్డ్ కప్ అడుతున్న MS ధోని చేసిన ఓంటరి పోరు ఓకింత ఓదర్పునీ మిగిల్చింది.

సామాన్య అభీమానులే కాదు, భారత ప్రధాని నరేంద్ర మోడీ, క్రికెట్ లెజండ్ సచిన్ టెండుల్కర్, సినీమా హీరోలు, మాజి క్రికెటర్లు, ఇతర దేశ క్రికెటర్లు అందరు కూడా భారత జట్టు పోరటాన్నీ సమర్ధించారు.

ఏ ఆట అయినా గెలుపు ఓటములు సహజం, ఆ రోజు ఆటలో మనవంతు ప్రయత్నం ముఖ్యం. ఇది ఎరిగి నడచుకోవడం ఆటగాళ్ళకు మరియూ అభిమానులకూ మంచిది. ఇప్పుడు భారత అభిమానులు అదే.. కనబరిచారు, వీరిని చూసి మిగతా దేశాల అభిమానులూ.. నేర్చుకోవాలని ఆశిద్దాం.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *