2028 ఒలింపిక్స్ లో క్రికెట్…

ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ లో క్రికెట్‌ను చేర్చాలనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అందుకు తగ్గట్టే 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టడానికి ఐసీసీ ప్రయత్నాలు చేస్తుంది. ఈ మేరకు మెరిల్‌బోన్‌ క్రికెట్‌ కమిటీ(ఎంసీసీ) సమావేశంలో చర్చించారు. దీనిపై ఎంసీసీ చైర్మన్‌ మైక్‌ గాటింగ్‌ మాట్లాడుతూ. 2028లో క్రికెట్‌ను ఒలింపిక్స్ లో చూస్తామని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల అంతర్జాతీయ డోపింగ్‌ వ్యతిరేక ఏజెన్సీ (వాడా) అనుబంధ.. జాతీయ డోపింగ్‌ నిరోధక ఏజెన్సీ (నాడా) పరిధిలోకి బీసీసీఐ రావడం కూడా ఒలింపిక్స్ లో క్రికెట్‌ ప్రవేశానికి మార్గం సుగమమైంది. ఒలింపిక్స్‌ నిబంధనల ప్రకారం అన్ని క్రీడా సమాఖ్యలు వాడా పరిధిలోకి రావాల్సి ఉంటుంది. అయితే ఈ ఆటలు నెలరోజుల పాటు కాకుండా రెండు వారాల్లోనే పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పేర్కొన్నాడు. అన్ని పురుష జట్లతో పాటు మహిళల జట్లూ ఇందులో పాల్గొంటాయని వివరించాడు. ఇప్పటికే చాలాసార్లు క్రికెట్ ను ఒలింపిక్స్ లో చేర్చాలని చాలామంది అభిప్రాయపడ్డారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *