దేవసేన అల్టిమేట్‌ లుక్‌.!

‘బాహుబలి’ సినిమాలో అనుష్కని రాజమౌళి ఎంత గొప్పగా చూపిస్తాడోనని అంతా ఎదురుచూస్తూనే వున్నారు. తొలి పార్ట్‌ వచ్చింది, అనుష్క లుక్‌ నిరాశపర్చింది. రెండో పార్ట్‌ వస్తోంది.. ఇప్పటికే పలు లుక్స్‌ విడుదలయ్యాయిగానీ, అందరి అంచనాల మేరకు ఆమె లుక్‌ ఇప్పటిదాకా రాలేదనే చెప్పాలి. ప్రభాస్‌తో కలిసి బాణం పట్టుకున్న లుక్‌ ఒక్కటీ, ఇప్పటిదాకా వచ్చిన వాటిల్లో బెస్ట్‌. దాన్ని తలదన్నే లుక్‌ లేటెస్ట్‌గా విడుదలయ్యింది.

అమరేంద్ర బాహుబలి భార్యగా ‘దేవసేన’ ఈ ఫొటోలో ఒలకబోస్తున్న రాజదర్పం చూస్తే ఎవరైనాసరే ‘వారెవ్వా అనుష్క’ అనాల్సిందే. ‘బాహుబలి ది బిగినింగ్‌’లో ‘అవంతిక’గా తమన్నా గ్లామరస్‌ లుక్‌తో కన్పిస్తే, అంతకు మించిన హుందాతనం ఇప్పుడు దేవసేన ‘బాహుబలి ది కంక్లూజన్‌’లో ప్రదర్శిస్తోంది. రెండో పార్ట్‌లో అనుష్క యుద్ధ విన్యాసాలూ ఆకట్టుకోనున్నాయట. ఆ విన్యాసాలేంటో తెలియాలంటే సినిమా విడుదలయ్యేదాకా వేచి చూడాల్సిందే.

మరోపక్క, ‘బాహుబలి ది కంక్లూజన్‌’ రెండ్రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం విదితమే. సినిమా టిక్కెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. థియేటర్ల ముందు అడ్వాన్స్‌ బుకింగ్‌ల కోసం క్యూ లైన్లు చాంతాడంత దర్శనమిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. తొలి రోజు అత్యధిక థియేటర్లలో సినిమాని ప్రదర్శించడం ద్వారా ఎప్పటికీ చెరిగిపోని రికార్డ్‌ సొంతం చేసుకోవాలని ‘బాహుబలి ది కంక్లూజన్‌’ టీమ్‌ భావిస్తోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *