నా పేరును ఆ హీరోతో ముడిపెట్టడం నీచం..నా శ్రేయోభిలాషి: అమలాపాల్

చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని ఏడాది తిరక్కుండానే విడాకులు తీసుకుని వార్తల్లో నిలిచింది మలయాళ భామ అమలాపాల్‌. ఆమె భర్త నుంచి విడిపోవడానికి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అల్లుడు ధనుష్‌ కారణమంటూ తమిళ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అమలకు, ధనుష్‌కు మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ వార్తలు పుట్టుకొస్తున్నాయి.

వివాహానికి పూర్వం, విడాకుల తర్వాత వరుసబెట్టి ధనుష్‌ సినిమాల్లో అవకాశాలు అందుకుంటోంది అమల. ఇప్పుడు తెరకెక్కుతున్న ‘వీఐపీ-2’లో అమలను తీసుకోవద్దని ధనుష్‌ను కోరిందట ఆమె మాజీ భర్త కుటుంబం. కానీ, ధనుష్‌ వారిని లెక్కచేయకుండా అమలకే ఛాన్సిచ్చాడు. ఈ నేపథ్యంలోనే తమిళ మీడియా వీరి మీద వరుసబెట్టి కథనాలు ఎక్కుబెడుతోంది.

ఈ వార్తలు అమలాపాల్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. ఇలా ఓ పెళ్లైన వ్యక్తి గురించి దుష్ప్రచారం చేయడం చాలా నీచమని విరుచుకుపడింది. ధనుష్‌ తన శ్రేయోభిలాషి అని, తన కాపురాన్ని నిలబెట్టడానికి కూడా ఆయన ప్రయత్నించాడని చెప్పింది. అలాంటి వ్యక్తితో తన పేరును ముడిపెడుతూ వార్తలు ప్రచారం చెయొద్దని విజ్ఞప్తి చేసింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *