ఆ విషయం ధోనికే వదిలేయండి: సచిన్ తెండుల్కర్

మాంచెస్టర్‌: టీమిండియా మాజీ సారథి, వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ తాజా ప్రపంచకప్తోనే అంతర్జాతీయ కెరీర్ ముగుస్తుందని వస్తున్న వార్తల నేపధ్యంలోభారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెండుల్కర్ స్పందించారు. అతడి రిటైర్మెంట్ విషయాన్నీ అతనికే వదలాలని, ఎవరు కల్పించుకోకూడదు అని అన్నారు.భారత జట్టుకు ధోనీ ఎన్నో సేవలను అందించారని, ప్రతీ ఒక్కరూ దాన్ని గౌరవించాలని మాస్టర్‌ బ్లాస్టర్‌ చెప్పారు.‘భారత జట్టులో అతడిది ప్రత్యేక స్థానమని,
ధోనీలాంటి కెరీర్‌ ఎవరికి ఉంటుందని, అతడు టీమిండియాకి అందించిన సేవలే భారత ప్రజల గుండెల్లో నమ్మకానికి అద్దం పట్టాయని పేర్కొన్నారు. న్యూజిలాండ్‌తోమ్యాచ్‌లోఅతడు ఔటయ్యే వరకు భారత్‌ ఓడిపోలేదు. అతడు గెలిపిస్తాడనే నమ్మకం, ఆశ అందరిలోనూ ఉంది’ అని సచిన్‌ పేర్కొన్నాడు. న్యూజిలాండ్ బౌలర్లు గొప్పగా బౌలింగ్ చేసారు. తోలి అరగంటలో వాళ్ళు చేసిన బౌలింగ్ మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది. ఆ సమయంలో ధోని జడేజతో కలిసి కీలకమయిన భాగాసౌమ్యని నెలకొల్పి ఇండియాని విజయానికి చేరువచేసాడు. 49వా ఓవర్లో ధోని మార్టిన్‌ గప్తిల్‌ డైరెక్ట్‌ త్రో విసరడం ద్వారా ధోనీ(50) పెవిలియన్ చేరాడు.దీనితో ఇండియా టీమ్ ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *