పరిపూర్ణ ఆరోగ్యానికి పది చిట్కాలు…

చదువుకునెటప్పుడు నిద్రను ఆపాలంటే ఇలాచి లేదా లవంగం నములుతుండాలి ఇలా చేయడం వల్ల చదువుకునేటప్పుడు నిద్ర రాకుండా చేయవచ్చు

చాతిలో మంట ఉన్న వారు ప్రతి రోజు అల్లం టీ తీసుకుంటే చాతి లో మంటను తగ్గించు కొవచ్చు.

Turmeric-cardamom-pepper-fennel
Turmeric-cardamom-pepper-fennel

అతిగా వాంతులు చేసుకునే సమయం లో అల్లం ముక్కను చప్పరిస్తే వాంతుల నుండి ఉపశమనం పొందవచ్చు

ప్రతి రోజు రెండు తులసి ఆకులు తింటే కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది

అల్లం టీ లేదా అల్లం వేసి మరగించిన నీళ్ళు తాగుతు ఉండటం వల్ల నెల సరి తో వచ్చె నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు, టీ స్పూన్ అల్లం రసం తేనెతో తాగితే గొంతు నెప్పికి ఉపశమనం ఉంటుంది.

అర గ్లాస్ పాలల్లో కాస్త పసుపు ,చిన్న అల్లం ముక్క వేసి తాగితే అలర్జీ తో విముక్తి పొందవచ్చు.

health
health

రోజు 4 లేక 5 తులసి ఆకులు తింటే ఆరోగ్యానికి మంచిది.

మందార పూలు ,ఎండబెట్టిన మందార ఆకులను కొబ్బరి నూనెలో మరగించి చల్లారాక తలకు మర్దన చేసుకుంటే జుట్టు రాలటం ,తెలబడటన్ని నివారించ వచ్చు. మెంతులు రాత్రి పూట నానబెట్టి మరునాడు ముద్దగా చేసుకొని .ఈ ముద్దను తలకు పట్టించి 20 నిమిషాల తరువాత తల సాన్నం చేయాలి. ఇలా చేస్తే చుండ్రు నివారించవచ్చు.

పాలమీగడ ,మైదపిండి ముద్దగా చేసుకొని ముఖానికి పట్టించి 5 నిమిషాల తరువాత ముఖం కడుకుంటే కాంతివంతగా తయరవుతుంది.

కర్పూరం ,కొబ్బరి నూనె కలిపి పాదాలకు రాస్తే పగిలిన పాదాల నుండి విముక్తి పొందవచ్చు.మడమ నొప్పి తగ్గాలంటే ఆముదం పాదాలకు రాయాలి.

తేనె ముఖానికి రాసుకొని 20 నిమిషాల తరువాత కడుకుంటే పొడి చర్మం మీద తేమ చెరిగి నిగనిగ లాడుతుంది.ఒక టేబుల్ స్పూన్ శనగపిండి మరోక స్పూన్ పెరుగు ముద్ధగా చేసుకొని ముఖానికి రాసుకొవాలి కాసేపటి తరువాత ముఖం గోరు వెచ్చని నీటితో శుభ్రంగా కడుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం పైన మచ్చలు తగ్గతాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *