దిల్ రాజు కు చుక్కలు కనిపిస్తున్నాయా?

ఏదో ఆవేశంలో భారతీయుడు 2 తీస్తాను అని ప్రకటించాడు కాని వాస్తవానికి దిల్ రాజుకు దాని గురించి కొత్త టెన్షన్ పట్టుకుందట. బిజినెస్ పరంగా సినిమా విషయంలో చాల పర్టికులర్ గా లెక్కలు వేసుకుని మరీ ప్లానింగ్ చేసుకునే దిల్ రాజు భారతీయుడు సీక్వెల్ విషయంలో మాత్రం ఊహించని రేంజ్ లో బడ్జెట్ చిక్కుముడులు ఉండటంతో దీంట్లో నుంచి డ్రాప్ అవ్వడమే బెటర్ అని ఫీల్ అవుతున్నాడట.

దర్శకుడు శంకర్, హీరో కమల్ హాసన్ ఇద్దరికి రెమ్యునరేషన్ రూపంలోనే 80 కోట్లకు పైగా సమర్పించుకోవాల్సి రావడం, ఫస్ట్ పార్ట్ తీసిన ఎఎం రత్నం టైటిల్ అండ్ కాన్సెప్ట్ వాడుకున్నందుకు 25 కోట్ల దాకా రాయల్టీ డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు రావడం, అసలు షూటింగ్ క్లాప్ బోర్డు కొట్టక ముందే 100 కోట్ల ఖర్చు కళ్ళ ముందు కనిపిస్తుంటే ఎంత గుండె ధైర్యం ఉన్నవాళ్ళకైనా కొంత వణుకు పుట్టడం సహజం.

పైన ఖర్చు కాకుండా భారతీయుడు సీక్వెల్ తీయాలంటే కనీసం 150 నుంచి 200 కోట్ల దాకా బడ్జెట్ డిమాండ్ చేస్తున్నాడట శంకర్. కమల్ పొలిటికల్ ఎంట్రీ ఖరారైన నేపధ్యంలో షూటింగ్ మొదలు పెట్టినా ప్లానింగ్ ప్రకారం జరగడం అసాధ్యం. పైగా శంకర్ డెడ్ లైన్ పెట్టుకుని సినిమా తీయడు. రెండేళ్ళన్నా మూడేళ్ళన్నా భరించాల్సిందే. మరి వందల కోట్లు పెట్టుబడి పెట్టి సంవత్సరాల తరబడి వెయిట్ చేయటం ఏడాదికి ఐదారు సినిమాలు నిర్మిస్తూ పదుల సంఖ్యలో సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసే దిల్ రాజు లాంటి వాళ్ళకు సెట్ కాదు.

అందుకే దిల్ రాజు ఇందులో నుంచి తప్పుకోవాలి అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. అఫీషియల్ గా ఆయనేమి కన్ఫర్మ్ చేయనప్పటికీ రోబో 2.0 ఆడియో ఫంక్షన్ జరిగే లోపు దీని గురించి క్లారిటీ రావొచ్చు. అయినా భారతీయుడు సీక్వెల్ కి అయ్యే టోటల్ బడ్జెట్ తో దిల్ రాజు బిందాస్ గా ఓ పది పదిహేను భారీ సినిమాలు తీసేయొచ్చు. అలా లెక్కలేసే ఇలా అనుకున్నారేమో.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *