చేయూత: బిచ్చగాడిగా మారిన పల్లుబాబును చేరదీసిన దర్శకుడు, నటుడు!

తమిళ హాస్య నటుడు పల్లుబాబు ఓ వైపు అవకాశాలు లేక, మరో వైపు తల్లిదండ్రులను కోల్పోయి బిచ్చగాడిగా మారిన సంఘటన అందరినీ కలిచి వేసింది. ఈ విషయం మీడియాలో హైలెట్ కావడంతో తమిళ సినీపరిశ్రమకు చెందిన పలువురు చలించిపోయారు.పల్లుబాబు విషయం తెలుసుకున్న తమిళ దర్శకుడు మోహన్‌, స్టంట్‌ యాక్టర్ సాయిదీనమ్‌లు అతడిని తమ ఇంటికి తీసుకొచ్చారు. దీని గురించి వారు ఓ వీడియో విడుదల చేశారు. పల్లుబాబు ఆరోగ్యంగానే ఉన్నాడని, అతడి మానసిక స్థితి బాగోలేదనే వార్తల్లో నిజం లేదని తెలిపారు.

పల్లుబాబు తమ వద్ద ఉన్న విషయం తెలుసుకున్న కొందరు దర్శకులు ఫోన్‌ చేసి అవకాశం ఇస్తామని చెబుతున్నారు. ఆయన మళ్లీ తమిళ సినిమాల్లో నటించి సాధారణ స్థాయికి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

2004లో వచ్చిన కాదల్ (తెలుగులో ప్రేమిస్తే) సినిమాలో నటించాడు. భరత్, సంధ్య హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో….. సినిమా స్టార్ అవుదామని సిటీకి వచ్చిన వృశ్చికకాంత్ అనే యువకుడి పాత్రలో పల్లుబాబు నటించాడు. తనది వృశ్చిక రాశి అని, దానికి కాంత్ కలిపి వృశ్చికకాంత్ అనే పేరు పెట్టుకుంటే పెద్ద స్టార్ అవుతానని జ్యోతిష్కుడు చెప్పాడని, హీరోగా చక్రం తిప్పుతా, ఆ తరువాత రాజకీయాల్లోకి వెళ్తా, ఆ తరువాత సీఎం అవుతా అంటూ.. కామెడీ పండించే పాత్రలో పల్లుబాబు నటించాడు.

‘ప్రేమిస్తే’ సినిమా తర్వాత పల్లుబాబుకు అవకాశాలు లేక పోవడం, పేదరికానికి తోడు తల్లిదండ్రులు కూడా మరణించడంతో అనాదగా మారిన పల్లు బాబు పొట్టపోసుకునేందుకు చెన్నైలోని ఓ గుడి ముందు భిక్షాటన చేస్తున్న విషయం మీడియా కంటపడింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *