రాజమౌళి ఇంట్లో పెళ్లి బాజాలు..జగపతి బాబు ఫ్యామిలీతో వియ్యం!

నిజానికి కన్న కొడుకు కాకపోయినా అంత కన్నా ఎక్కువగానే చూసుకుని పెంచుకున్న రాజమౌళి వారసుడు కార్తికేయ నిశ్చితార్థం జరిగిపోయింది. మీడియాలో ఎక్కువ హై లైట్ కాకుండా చాలా పరిమితంగా పిలిచిన అతిధుల మధ్య సింపుల్ గా కానిచ్చేశారు. అత్యంత సన్నిహితులను తప్ప ఇంకెవరిని ఈ వేడుకకు పిలవలేదు. అమ్మాయి పేరు పూజా ప్రసాద్. తను ఎవరో కాదు  స్వయానా జగపతి బాబు అన్నయ్య వీరమాచినేని రామ్ ప్రసాద్ కూతురు.

ఆయనకు రిటైల్ చైన్ బిజినెస్ ఉంది. ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యే క్షణం దగ్గరకు వచ్చేసింది. కార్తికేయ రాజమౌళితో పాటు చాలా సినిమాల వ్యవహారాల్లో పాలు పంచుకున్నాడు. బాహుబలి ట్రైలర్ కట్ చేయటంతో అందరి ప్రశంశలు అందుకున్నాడు. వారాహి బ్యానర్ కు సంబంధించిన రెండు మూడు సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించాడు. పూజా విషయానికి వస్తే తనో కర్నాటిక్ సింగర్. గతంలోనే భక్తి ఆల్బమ్స్ కొన్ని విడుదల చేసి మంచి పేరు తెచ్చుకుంది.

పెళ్లి సంబంధించిన తేదీ తదితర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వేడుకలో అఖిల్ కూడా  సందడి చేసాడు. కార్తికేయ దర్శకుడిగా డెబ్యూ చేస్తాడని గతంలో వార్తలు వచ్చాయి కానీ వాటి తాలూకు అప్ డేట్స్ మాత్రం రాలేదు. కార్తికేయ డైరెక్షన్ కన్నా ఇతర సాంకేతిక విభాగాలపై ఎక్కువ ఆసక్తిగా ఉన్నాడని అందుకే ఉండకపోవచ్చనే టాక్ కూడా ఉంది. త్వరలో ఎన్టీఆర్ రామ్ చరణ్ ల మల్టీ స్టారర్ మొదలు పెట్టాల్సి ఉన్న నేపధ్యంలో రాజమౌళి ఈ పెళ్లి దాని కన్నా ముందే చేస్తాడా లేదా కొంత కాలం అయ్యాక దానికి గ్యాప్ ఇచ్చి కార్తికేయ వివాహం పూర్తి చేస్తాడా అనేది సస్పెన్స్. మీడియాను ప్రత్యేకంగా పిలవకపోయినా ఈవెంట్ తాలూకు ఫోటోలు మాత్రం ఆన్ లైన్ లో రచ్చ చేస్తున్నాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *