దువ్వాడ జగన్నాథం ట్రైలర్ కిర్రాక్

భారీ అంచనాలు నెలకొన్న దువ్వాడ జగన్నాథం చిత్రానికి సంబంధించి టీజర్ సోమవారం రాత్రి 7.30 గంటలకు రిలీజ్ అయింది. ఈ చిత్రంలోని ఓ పాటను బ్రాహ్మాణ సంఘాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో వివాదం రాజుకొన్నది. ఈ వివాదం ఓ వైపు కొనసాగుతుండగానే చిత్ర నిర్మాత టీజర్‌ను రిలీజ్ చేశారు. ఆ పాటకు రికార్డు స్థాయిలో డిజ్‌లైక్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

చిలిపి చిలిపి సరదాలు, హీరొయిన్ పూజా హేగ్డే తో లవ్ ట్రాక్ ఆ పైన మాస్ అవతార్ అంతలో బిజినెస్ మెన్ బ్లేజర్ తో కొత్త స్టైల్ వెరసి మాస్ ఫాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేలా ఉన్నాడు హరీష్ శంకర్. తనదైన ట్రేడ్ మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా బాగా దట్టించిన హరీష్ రొమాన్స్ కూడా ఫుల్ గా వడ్డించాడు. అసలు పూజా హెగ్డే లో ఇంత అందం ఉందా అని చూసినవారు ఒకే మాటగా చెబుతున్నారు.

మరో యాంగిల్ లో మాట్లాడుకుంటే ఇందులో కాస్త రెగ్యులర్ మాస్ మసాలాలు కూడా కలిసినట్టు కనిపిస్తుంది. ఇలాంటి సబ్జక్ట్స్ కి ఇవి అవసరం కూడా. హరీష్ శంకర్ సినిమాల్లో మిస్ అవ్వకుండా కనిపించే రావు రమేష్ ఇందులో మెయిన్  విలన్ గా చేసినట్టు కనిపిస్తోంది. కాని ఒకటి మాత్రం బన్నీ ఫాన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తోంది. అగ్రహారంలో బ్రాహ్మణుడిగా కనిపిస్తూ మరో ఫ్రేం లో స్టైలిష్ అవతార్ లో విలన్ కు వార్నింగ్ ఇచ్చే జెంటిల్ మెన్ గా కనిస్తుంటే ఇందులో డ్యూయల్ రోల్ ఏమైనా చేసాడా అని అనుమానపడుతున్నారు ఫాన్స్. మొత్తానికి కొంచెం రెగ్యులర్ ఫ్లేవర్ ఉన్నా కూడా మెగా ఫాన్స్ పండగ చేసుకునేలా ఉంది డిజే ట్రైలర్.

స్వచ్ఛమైన బ్రాహ్మణుడు విశ్వామిత్రుడి స్టయిల్లో ఆయుధం చేతపట్టి యుద్దానికి బయలుదేరతాడు. ‘బుద్దం శరణం గచ్చామి’ కాదు ఈ కాలానికి కావాల్సింది ‘యుద్దం శరణం గచ్చామి’ అంటూ క్లాసు పీకేసి తన పని తాను చేసుకుపోతుంటాడు డిజె. అల్లు అర్జున్ బ్రాహ్మణ్ గెటప్ లో బాగున్నాడు కాని.. ఆ ఉచ్చారణ కోసం కాస్త కష్టపడ్డాడనే చెప్పాలి. పూజా హెగ్డే గ్లామర్ ఆరబోసిందిలే. రావు రమేష్ పవర్ ఫుల్ గా ఉన్నాడు. అయానక బోస్ విజువల్స్ అదిరిపోయాయ్. దేవిశ్రీ మ్యూజిక్ కూడా బాగానే ఉంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *