పాపం..! డీజే ముంచేసినట్టేనా?, ఓవర్సీస్ లో 4 కోట్లకు దెబ్బ

సరైనోడు సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్న అల్లు అర్జున్ మారో భారీ హిట్ పై కన్నేశాడు. మళ్ళీ ఒక సారి అదే రేజ్ హిట్ కొట్టాలనుకున్నాడు. నెగెటివ్ టాక్ వచ్చినా తెలుగు రాష్ట్రాల్లో బాగానే దున్నేసాడు కానీ…. తెలుగుతో పాటు మళయాళంలోనూ తెగ క్రేజ్ సంపాదించుకున్న బన్నీ ఎన్ఆర్ఐ లను ఎందుకో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు.

ఓవర్సీస్ కలెక్షన్లు

ప్రస్తుతం పెద్ద సినిమాలకు ఓవర్సీస్ కలెక్షన్లు కీలకంగా మారాయి. అందుకే అల్లు అర్జున్ తోపాటు సినిమా టీం కూడా యూఎస్ లో డీజేను బాగానే ప్రమోట్ చేశారు. అయినా పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. మనదగ్గర ఈ సినిమాపై భారీ పెట్టుబడులు పెట్టిన బయ్యర్లు సేఫ్ జోన్లోకి వచ్చేసినట్లే కనిపిస్తున్నారు.

వసూళ్లు ఆశాజనకంగా లేవు

కానీ ఇక్కడ పరిస్థితి బాగానే ఉంది కానీ.. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటరే అన్యాయం అయిపోయినట్లుగా తెలుస్తోంది. అక్కడ ‘డీజే’ వసూళ్లు ఆశాజనకంగా లేవు. ప్రిమియర్లకు రెస్పాన్స్ బాగానే కనిపించింది. తొలి రోజూ ఓకే. కానీ తర్వాతే పరిస్థితి తల్లకిందులైంది. నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయిపోవడంతో అక్కడ ఆశించిన వసూళ్లు రాలేదు.

మంచి కలెక్షన్లే వచ్చాయి

డీజే సినిమా ఈ వీకెండ్ కు వన్ మిలియన్ వసూళ్లకు చేరుకుంది. సినిమా మొదటి రోజున మంచి కలెక్షన్లే వచ్చాయి. కానీ ఆ ఊపు ఒక్క రోజుకే పరిమితమైపోయింది. సినిమా రిలీజ్ రోజున హాఫ్ మిలియన్ డాలర్లు వస్తే.. ఇంకో హాఫ్ మిలియన్ రావడానికి ఆరు రోజులు పట్టింది.

ఓవర్సీస్ రైట్స్ 9 కోట్లు

ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ రూ. 9 కోట్ల వరకు పలికిందని టాక్. ఈ లెక్కన మిలియన్ డాలర్లు వసూలు చేసినా ఇంకా పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి లేదు. కలెక్షన్లు ఇంక పుంజుకునే అవకాశం లేదు. దీంతో ఓవర్సీస్ లో డిస్ట్రిబ్యూటర్ కు భారీ లాస్ తప్పదు. అల్లు అర్జున్ సినిమాల్లో వన్ మిలియన్ మార్క్ చేరుకున్న సినిమాల్లో డీజే మూడోది. ఇంతకు ముందు రేసుగుర్రం సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు ఈ మార్క్ చేరుకున్నాయి

5 కోట్లకు దాటేలా లేదు.

రెండో వీకెండ్ అయ్యేసరికి ఈ చిత్రం అమెరికా లో 1.1 మిలియన్ డాలర్లే వసూలు చేసింది. ఫుల్ రన్లో ఈ చిత్రం 1.2-1.3 మిలియన్ డాలర్లకు పరిమితం అయ్యేలా కనిపిస్తోంది. ఈ చిత్రానికి ఉన్న హైప్ చూసుకుని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ఏకంగా రూ.9 కోట్ల పెట్టుబడి పెట్టేశాడు. ఇప్పుడు చూస్తే షేర్ 5 కోట్లకు దాటేలా లేదు.

 4 కోట్ల దాకా నష్టంఅంటే మొత్తం మిద ఎంతలేదన్నా 4 కోట్ల దాకా నష్టం తప్పేలా లేదు. అమెరికాలో వచ్చే వసూళ్లలో సగానికి సగం ఖర్చులు.. పన్నుల రూపంలో పోతాయి. షేర్ యాభై శాతమే వస్తుంది. ఫుల్ రన్లో గ్రాస్ రూ.10 కోట్లలోపే ఉండే పరిస్థితి కనిపిస్తోంది. అసలే నెగెటివ్ టాక్ తో మొదలై పుంజుకోవటానికి కష్టపడ్డ డీజే ఇక్కడ బాగానే నెట్టుకొచ్చాడు గానీ బయట మాత్రం మళ్ళీ నిరాశ

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *