మహిళలపై పుతిన్ సంచలన వ్యాఖ్యలు!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మహిళలకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ‘నేను మహిళను కాదు.. అందుకే నాకు చెడు రోజులు అంటూ రావు’ అని ఫిల్మ్ మేకర్ ఓలివర్ స్టోన్‌తో మాట్లాడుతూ నోరు జారారు రష్యా అధినేత పుతిన్. తన ఉద్దేశం మహిళలను కించ పరచడం కాదని, అది కేవలం ప్రకృతి పరంగా అలా జరగుందని.. మనం దాన్ని అడ్డుకోలేం కదా అంటూ తన వ్యాఖ్యలను పుతిన్ సమర్థించుకోవడం గమనార్హం.

అస్కార్ అవార్డు గ్రహీత, హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఓలివర్ స్టోన్ పుతిన్‌పై ఓ డాక్యుమెంటరీ తీయాలని ప్లాన్ చేశారు. నాలుగు భాగాలుగా దీన్ని తెరకెక్కించనున్నారు. ఇందులో భాగంగా రష్యా అధినేత పుతిన్‌తో కలిసి మాస్కో నగరంలో కారులో ప్రయాణిస్తు కొన్ని విషయాలపై ప్రశ్నించారు స్టోన్. డాక్యుమెంటరీ కోసం జూలై 2015 నుంచి నేటికీ పుతిన్‌తో సమావేశమవుతున్నారు. ఈ క్రమంలో ఎడ్వర్డ్ స్నోడెన్ అంశంపై, 2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందా? అన్న విషయాలు అడిగి తెలుసుకున్నారు. కీలక పదవిలో ఉంటూ బాధ్యతలు ఎలా నిర్వహిస్తున్నారంటూ ఓలివర్ అడిగిన ప్రశ్నకు పుతిన్ బదులిస్తూ.. ‘నాకు చెడు రోజులు అంటూ ఉండవు. కష్టాలు రావు. ఎందుకంటే నేను మహిళను కాదు. ప్రకృతి ధర్మం ఇలాగే ఉంటుంది. ఎవరినీ కించపరచాలని ఈ వ్యాఖ్యలు చేయడం లేదంటూ’ పేర్కొన్నారు.

పుతిన్‌పై ఓలివర్ డాక్యుమెంటరీ సంగతి దేవుడెరుగును కానీ.. ఆయన తాజా ఇంటర్వ్యూతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళలంటే పుతిన్‌కు అంత చులకనగా ఉందా? అంటూ మహిళాలోకం విరుచుకుపడుతోంది. మరోవైపు వచ్చే నెలలో రెండు గంటలపాటు సాగే డాక్యుమెంటరీ భాగాన్ని తెరపై ప్రదర్శించాలని అస్కార్ గ్రహీత ఓలివర్ ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *