9 వరకు అంత్యక్రియలు నిర్వహించవద్దని

దిశ నిందితుల అంత్యక్రియలకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై దాఖలైన పిటిషన్‌పై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అత్యవసర విచారణ చేపట్టింది.నిందితులు ఆరిఫ్‌, నవీన్‌, చెన్నకేశవులు, శివ మృతదేహాలను డిసెంబర్ 9 వరకు భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది. ఆ రోజు ఉదయం 10:30 గంటలకు కేసు విచారణను చేపడతామని న్యాయస్థానం వెల్లడించింది. మృతదేహాల పోస్టుమార్టం వీడియోలను జిల్లా జడ్జికు అందజేయాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో అంత్యక్రియల ప్రక్రియ ఆగిపోయింది. మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీలో మృతదేహాలను భద్రపరిచారు. నిందితుల ఎన్‌కౌంటర్‌ను వ్యతిరేకిస్తూ కొన్ని మహిళా సంఘాలు హైకోర్టుకు లేఖ రాశాయి. హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై స్పందించిన హైకోర్టు ఈనెల 9 వరకు మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించవద్దని ఆదేశించింది. కేసును 9వ తేదీన విచారణ జరపనున్నట్టు తెలిసింది. మరోవైపు ఆ నలుగురిని నకిలీ హత్య చేశారని, ఆ పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ముంబైకి చెందిన న్యాయవాది గురునాథ సదావర్తి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. జాతీయ మానవహక్కుల కమిషన్, తెలంగాణ హైకోర్టు, తెలంగాణ డీజీపీకు కూడా లేఖ రాశారు.
ఈ ఘటనపై ఏపీ హోంమంత్రి సుచరిత

ట్విట్టర్‌లో స్పందించారు. ‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే’ అంటూ భగవద్గీతలోని శ్లోకాన్ని ప్రస్తావించారు. ‘సజ్జనుల సంరక్షణార్థమూ, దుష్టజన శిక్షణకూ, ధర్మసంస్థాపన కోసం.. ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూనే వుంటాను’అంటూ శ్రీకృష్ణుడు ఈ శ్లోకాన్ని చెప్పారు. పాపాలు పెరిగినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు.. ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రతి యుగంలోఇటు సోషల్ మీడియాలోనూ ఈ ఘటనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నిందితులకు సరైన శిక్ష పడిందంటూ ట్వీట్లు, పోస్టులు ట్రెండ్ అవుతున్నాయి. తెలంగాణ పోలీసులు, సీపీ సజ్జనార్‌ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఘటన జరిగిన తర్వాత పోలీసుల నిర్లక్ష్యంపై మండిపడిన వారే ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అలాగే పోలీసులు మంచి పనిచేశారంటూ ఎన్‌కౌంటర్‌పై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *