ఆ శిశువు చూపును గమనించిన వైద్యులు

రియో డీ జెనెరియో: ఇటీవల ఒక మహిళ పండంటి శిశువుకు జన్మనిచ్చింది. వైద్యులు బొడ్డు తాడు కట్ చేసేముందు ఆ శిశువును ఏడిపించేందుకు ప్రయత్నిస్తుండగా, ఆ శిశువు ఇచ్చిన రియాక్షన్‌కు వైద్యులు కంగుతిన్నారు. దీనికి సంబంధించిన ఫొటో కెమెరాలో బందీ అవడంతో పాటు బయటకు రాగానే వైరల్‌గా మారింది. ఈ ఫొటోను చూసిన వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆ శిశువు పుట్టిన వెంటనే ఏడవలేదు. దీంతో వైద్యులు బొడ్డుతాడు కట్ చేసేముందు ఆ శిశువును ఏడిపించే ప్రయత్నం చేశారు. దీంతో ఆ శిశువు వైద్యులవైపు ఉరుముతున్నట్టు చూసింది. మొదట ఆ శిశువు చూపును గమనించిన వైద్యులు  ఆశ్చర్యపోయారు.  తరువాత తేరుకున్నారు. ఆ శిశువు పూర్తి ఆరోగ్యంతో ఉండటంతో సంతోషం వ్యక్తం చేశారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *