ప్రమాణస్వీకారోత్సవం ముందు రోజు రాత్రి ట్రంప్ ఏం చేశారు?

అమెరికా 45వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయటానికి ముందు.. సంప్రదాయంగా జరగాల్సిన కార్యక్రమాలన్నీ ముందుగా నిర్ణయించినట్లుగానే సాగాయి. ప్రమాణస్వీకారోత్సవం ముందు రోజు రాత్రి.. సంప్రదాయం ప్రకారం వైట్ హౌస్ కు సమీపంలోని బ్లెయిర్ హోస్ లో ట్రంప్ బస చేశారు. గురువారం రాత్రి అక్కడే ఉన్న ఆయన.. శుక్రవారం ఉదయం భార్య మెలానియా.. కుమార్తె ఇవాంకా.. అల్లుడు.. తన కుమారులు.. వారి కుటుంబాలతో కలిసి సెయింట్స్ జాన్స్ చర్చ్ లో జరిగిన ప్రార్థనలకు హాజరయ్యారు.

అక్కడ నుంచి సంప్రదాయం ప్రకారం వైట్ హౌస్ కి వెళ్లారు. అధ్యక్ష బాధ్యతల నుంచి కొద్ది గంటల్లో వైదొలగనున్న బరాక్ ఒబామా దంపతులతో కలిసి తేనీరు తీసుకున్నారు. మరోవైపు.. ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి బయలుదేరే ముందు ఒబామా.. ఎనిమిదేళ్లుగా తాను విధులు నిర్వర్తిస్తున్న ఓవల్ ఆఫీసులో కలయదిరిగారు. తాను ఎన్నో సంతకాలు చేసిన రిజల్యూట్ డెస్క్ మీద తదుపరి అధ్యక్షుడికి ఒక లేఖ ఉంచారు. ఈ టేబుల్ కు ఘన చరిత్ర ఉంది. దీన్ని 19వ శతాబ్దంలో ఎలిజిబెత్ రాణి అమెరికా అధ్యక్షుడికి బహుకరించారు. నాటి నుంచి నేటి వరకూ ఈ టేబుల్ నే అమెరికా అధ్యక్షులు వినియోగిస్తున్నారు. ఓవల్ ఆఫీసు నుంచి దేశ ప్రజలకు మీరేమైనా చెప్పదలుచుకున్నారా? అని మీడియా అడిగిప్పుడు.. ఆయన చాలా సింఫుల్ గా.. ‘థ్యాంక్ యూ’ అన్న మాటతో ముగించారు.

కొత్తగా అధ్యక్షుడి బాధ్యతల్ని స్వీకరించేందుకు వైట్ హౌస్ నుంచి బయలుదేరిన ట్రంప్.. వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ భవనం మెట్ల మీద లక్షలాది మంది మద్దతుదారుల నడుమ ప్రమాణస్వీకార మహోత్సవాన్ని స్థానిక కాలమానం ప్రకారం 12 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు. గతంలో అధ్యక్షుల ప్రమాణస్వీకార మహోత్సవానికిహాజరైన వారితో పోలిస్తే.. తాజా ప్రమాణస్వీకారోత్సవానికి హాజరైన ప్రజల సంఖ్య తక్కువని చెప్పాలి. ప్రమాణ స్వీకారోత్సవం ముగిసిన మరుక్షణం ప్రపంచంలో ఎక్కడైనా అణుదాడి చేయటానికి అనుమతిచిన్చే న్యూక్లియర్ కంట్రోల్ రిమోట్ ఆయన చేతికి అందింది. దీంతో.. ఆయనఅమెరికా అధ్యక్షుడిగానే కాదు.. ప్రపంచానికి పెద్దన్నగా అవతరించినట్లైంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *