స్వీట్లు తింటే శృంగారంలో రెచ్చిపోవచ్చు…..

శృంగారంలో ప్రతి రోజూ పాల్గొనడం వల్ల ఎనలేని ప్రయోజనాలు ఉంటాయని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. భార్యభర్తల మధ్య బంధం పటిష్టం కావడమే కాకుండా పగటి పూట, రోజూవారీ పనుల్లో చిరాకు, ఒత్తిడి తగ్గుతుందని సెక్సాలజిస్టులు చెబుతున్నారు. ఉదయం చేసే జాగింగ్ కంటే ఎన్నో రెట్లు సెక్స్ ఉత్తమం అంటున్నారు వైద్య నిపుణులు. కొంత మంది దంపతులు రాత్రి కన్న తెలవారుజామున ఎక్కువ సెక్స్‌లో పాల్గొంటారని ఓ సర్వేలో వెల్లడైంది.

అంతేకాదు.. అలసిపోయి ఇంటికొచ్చిన వెంటనే మీకు నచ్చిన స్వీట్స్ తీసుకోవడం ద్వారా స్టామినా పెంచుకోవచ్చని, తద్వారా రోజంతా కోల్పోయిన శక్తిని తిరిగి పొందవచ్చని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పడకగదిలో దూరి మీ భాగస్వామిని రెచ్చగొట్టి, ఊపేయడానికి ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెబుతున్నారు డాక్టర్లు.

అయితే శృంగారానికి ముందు ఆహారాల్లో పచ్చికూరలు, చేదుగా, వగరుగా ఉండే కూరగాయలు తినడం కన్నా కొన్ని ఆరోగ్యకరమైన తీపి పదార్థాలు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. తీపి పదార్థాలు తీసుకుంటే మీ భాగస్వామితో సంభోగం కూడా మధురంగా ఉంటుందని సెక్సాలజిస్టులు సూచిస్తున్నారు.

సలాడ్స్‌లో టమోటోల ముక్కలను జోడించి డిన్నర్‌కు ముందు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే శృంగారానికి ముందు ఒక గ్లాస్ బాదం మిల్క్ త్రాగడం వల్ల మంచి శక్తిని పొందవచ్చు.

శృంగారంలో పాల్గొనడానికి ముందు చాక్లెట్ తినడం వల్ల మీ స్టామినా పెరుగుతుంది. చాక్లెట్ తింటూ టీవీల్లో భామలు కోరికలను బుసకొట్టించే దృశ్యాలను మీరే చూసే వుంటారు.

take-sweets
take-sweets

అందరూ ఎంతో ఇష్టంగా తినే దానిమ్మ పండు శృంగారానికి మంచి ప్రేరేపకంగా పనిచేస్తుందని చాలామందికి తెలియదు. టెస్టోస్టిరాన్‌ స్థాయులను పెంచడంతో పాటు స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ లైంగికపరమైన కోరికలను పెంచే శక్తి దానిమ్మ జ్యూస్‌కు ఉంది. దానిమ్మ గింజలు శరీరంలో రక్తప్రసరణను నియంత్రిస్తాయి.

యాపిల్‌ పండులో ఉండే ఫినైల్‌థైలమైన్‌ సంతోషంగా, ఉత్తేజితంగా ఉంచడంలో తోడ్పడుతుంది. ప్రొస్టేట్‌ కేన్సర్‌ను అరికట్టడంలో యాపిల్స్‌లో ఉండే క్విర్‌సెటిన్‌ ప్రధాన పాత్ర పోషిస్తుంది.

స్ట్రాబెర్రీ పురుషుల్లో శృంగారపరమైన భావనలు పెంపొందించడంతో పాటు వీర్యవృద్ధికి స్రాబెర్రీ పండ్లు దివ్యౌషధంగా పనిచేస్తాయి. ఎర్రటి బెర్రీ పండ్లలో విటమిన్‌-బి, ఫోలేట్‌ సమృద్ధిగా లభిస్తాయి. వీటిలో అధికంగా ఉండే విటమిన్‌-సి లైంగిక వాంఛలను ద్విగుణీకృతం చేయడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. ఈ పండు శరీరంలో రక్తప్రసరణ స్థాయిని నియంత్రణలో ఉంచి, సహజసిద్ధమైన వయాగ్రా తరహాలో పనిచేస్తుంది. శృంగార జీవితాన్ని ఎంజాయ్‌ చేయాలంటే స్వీట్లు తప్పనిసరి అందుకే శోభనం రోజు గదిలో స్వీట్లు పెడతారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *