మెరిసే మెడ కోసం..ఎగ్‌ ప్యాక్‌..

యవ్వనంగా..అందంగా కనిపించడం కోసం యువత ఎంతగా ఆసక్తిని చూపిస్తుందో వేరే చెప్పనక్కర్లేదు. అందంగా కనిపించడం కోసం తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. కేవలం ముఖం మాత్రమే మెరిస్తే సరిపోదు..మెడ కూడా అందంగా కనిపించాలంటున్నారు బ్యూటీషియన్లు. అయితే  ముఖాన్ని స్క్రబ్ చేసేటప్పుడు మెడపై కూడా స్క్రబ్ చేయాలి అంటున్నారు బ్యూటీషియన్లు.

ఎక్కువగా మెడ భాగంలోనే చెమట పడుతుందని,  అందుకే ముఖానికి స్క్రబ్ వేస్తే.. తప్పకుండా మెడకు కూడా స్క్రబ్ చేయాలంటున్నారు. తద్వారా మృతకణాలు తొలగిపోతాయి, ముడతలకు చెక్ పెట్టవచ్చు అని తెలిపారు.  కోడిగుడ్డులోని తెల్లసొనలో ఒక స్పూన్ తేనె చేర్చి మెడకు పూతలా వేసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేస్తే.. ముడతలను దూరం చేసుకోని నిత్య యవ్వనులుగా కనిపిస్తారని కూడా చెప్తున్నారు.

అలాగే ఓట్స్‌ను ఉడికించి.. ఆరబెట్టుకోని, ఆ మిశ్రమంలో కోడిగుడ్డు తెల్లసొన, నిమ్మరసం ఒక స్పూన్ చేర్చి మెడకు ప్యాక్‌లా వేసుకుంటే ముడతలను దూరం చేసుకోవచ్చు.  ఇలా 15 రోజులకు ఓ సారి చేస్తే మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు.

ఇక పీచ్ పండ్లు పెరుగు, తేనె కలిపి మెడకు రాసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేస్తే.. నల్లటి వలయాలు, ముడతలు దూరమవుతాయని, సౌందర్యం మెరుగవడమేకాకుండా విటమిన్ క్యాప్సూల్స్ లేదా క్రీములను రాత్రి నిద్రించేందుకు ముందు మెడకు రాసి మసాజ్ చేస్తూ వస్తే.. నల్లటి వలయాలు తొలగిపోతాయని సూచించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *