‘RRR’ లో ఎన్టీఆర్ సరసన అమెరికన్ భామ ఎమ్మా రాబర్ట్స్

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’కు ఎన్టీఆర్‌కు జోడిగా ఓ ఫారిన్‌ భామ నటించనున్నారు. సినిమాలో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. చరణ్‌ అల్లూరి సీతారామ రాజు పాత్రలో, తారక్‌ కొమరం భీమ్‌ పాత్రల్లో నటిస్తున్నారు. ముందుగా ఈ సినిమాలో ఎన్టీఆర్ సర్సన నటించేందుకు హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గర్‌ జోన్స్‌ ను ఎంపిక చేశారు. అయితే వ్యక్తిగత కారణాలతో డైసీ ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవటంతో మరో ఇంగ్లీష్‌ బ్యూటీని వెతికే పనిలో పడ్డారు ఆర్‌ఆర్‌ఆర్‌ టీం.

అయితే సినిమాలో హాలీవుడ్‌ నటి ఎమ్మా రాబర్ట్స్ను ఎంపికచేసుకోవాలని చిత్రబృందం భావిస్తోందట. అయితే ఇది ఎంతవరకు నిజం? అన్న విషయమై చిత్రబృందం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఈ మల్టీ స్టారర్‌ సినిమాలో మరో హీరోగా నటిస్తున్న రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు. డీవీవీ దానయ్య సినిమాకు నిర్మాత. 2020 జులై 30న సినిమా అన్ని భారతీయ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *