ఇంజనీరింగ్‌లోసాధించినా కంప్యూటర్‌ కోర్సులు చేస్తేనే ఉద్యోగం

ఇంజనీరింగ్‌ చేసిన విద్యార్థులు మంచి మార్కులు సాధించినా ఇంటర్వ్యూల్లో వెనుకబడుతున్నారు. ఇంజనీరింగ్‌లో 90 శాతం మార్కులు సాధించినా అధిక సంఖ్యలో విద్యార్థులు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇంటర్వ్యూల్లో విజయం సాధించాలంటే.. ప్రధానంగా సాఫ్ట్‌ స్కిల్స్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌, టెక్నికల్‌ స్కిల్స్‌, హ్యూమన్‌ రిలేషన్స్‌ వంటివి పూర్తిగా కలిగి ఉంటే ఇంటర్వ్యూల్లో సులభంగా ఎంపికవుతారు. కళాశాలలో క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ ట్రైనింగ్‌కు తప్పనిసరిగా వెళ్లాలి. ఇప్పుడు కళాశాలలో అందరూ అవి ఏర్పాటు చేస్తున్నారు. ఎలా మాట్లాడాలి? అనేది నేర్పుతున్నారు. విద్యార్థులంతా వీటిని నేర్చుకుంటే ఉద్యోగాలు తప్పక సాధిస్తారు.సీఎస్‌ఈ విద్యార్థులకు ప్రత్యేక కోర్సులు.. ఇంజనీరింగ్‌లో సీఎస్‌ఈ బ్రాంచ్‌ పూర్తి చేసిన విద్యార్థులు ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు ఉండే కంప్యూటర్‌ కోర్సులు చేయాలి. ఆ కోర్సుల్లో బిగ్‌డేటా ఎనలిటిక్స్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్సీ అండ్‌ మిషన్‌ లెర్నీ, సైబర్‌ సెక్యూరిటీ వంటి మూడు కోర్సులను నేర్చుకోవాలి. ఇంజనీరింగ్‌లో మార్కుల శాతంతో పాటు కంప్యూటర్‌ కోర్సులు ఉంటేనే ఉద్యోగం సాధించవచ్చు. ఈసీఈ విద్యార్థులకు..ఈసీఈ బ్రాంచ్‌ చదివిన విద్యార్థులు కంప్యూటర్‌ కోర్సులు చేస్తే మంచిది. ఆండ్రాయిడ్‌ సిస్టమ్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్సీ అండ్‌ మిషన్‌ లెర్నీ, సైబర్‌ సెక్యూరిటీ కోర్సులు చేయాలి. ఈ కోర్సులు ఆరు నెలలు ఉంటాయి. దాంతో పాటు ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింక్స్‌ (ఐవోటీ) కోర్సును చేస్తే మరింత ఉపయోగం.ఈఈఈ విద్యార్థులకు..ఈఈఈ బ్రాంచ్‌ విద్యార్థులు ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింక్స్‌ కోర్సుతో పాటు పవర్‌ టెక్నాలజీ సోలార్‌ కోర్సు చేయాలి. ఈ కోర్సులు మూడు నెలల నుంచి ఆరు నెలలు ఉంటాయి.సివిల్‌ విద్యార్థులకు..ఇంజనీరింగ్‌ సివిల్‌ గ్రూపు చదివిన విద్యార్థులు స్ట్రక్చరల్‌ ఇంజనీరింగ్‌ రివిట్‌ ఆర్కిటెక్చర్‌, రివిట్‌ స్ట్రక్చర్‌, ఆటోక్యాడ్‌ కోర్సులను నేర్చుకోవాలి. వీటి ద్వారా ప్రాజెక్టుల ఏర్పాటుకు విద్యార్థులు ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరడానికి అవకాశాలు ఉంటాయి.మెకానికల్‌ గ్రూప్‌ విద్యార్థులకు..మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదివిన విద్యార్థులు రోబోటిక్స్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్సీ, ఆటోక్యాడ్‌, కెటియా కోర్సులను పూర్తి చేయాలి. ఇవి మూడు నెలల నుంచి ఆరు నెలలు కోర్సులుగా ఉంటాయి. ఈ కోర్సులు పూర్తి చేస్తేనే ఇంటర్వ్యూల్లో విద్యార్థికి ప్రాధాన్యం ఉంటుంది.కోర్సుతో పాటు అవగాహన ముఖ్యం ఇంజనీరింగ్‌ పూర్తి చేసినప్పుడు వారు చదివిన కోర్సుతో పాటు ఇంజనీరింగ్‌లోని ఇతర కోర్సులపై కూడా అవగాహన కలిగి ఉండాలి. వాటికి సంబంధించిన పుస్తకాలు చదవాలి. దాని వల్ల ఇంటర్వ్యూలకు వెళ్లినప్పుడు ఏ ఉద్యోగానికైనా ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. ఉన్నత చదువులపై దృష్టి పెట్టాలి.. ఇంజనీరింగ్‌ చదివిన విద్యార్థులు ఉద్యోగం వైపే చూస్తారు. అలా కాకుండా బీటెక్‌తో పాటు ఎంబీఏ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.  దాంతో పాటు ఇంజనీరింగ్‌ అయిన తరువాత ఇండియన్‌ ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌, ఇండియన్‌ రైల్వే సర్వీసెస్‌లోనూ చేరవచ్చు. గేట్‌ పరీక్షలకు కూడా వెళ్లాలి. గేట్‌ పరీక్షలో మంచి మార్కులు సాధిస్తే ప్రభుత్వ ఉద్యోగాలకు నేరుగా ఇంటర్వ్యూలకు వెళ్లే అవకాశం ఉంటుంది.మార్కులతో పాటు స్కిల్స్‌ అవసరంఇంజ నీరింగ్‌ చదివిన విద్యార్థులకు ఉద్యోగావకాశాలు సాధించాలంటే మార్కులతో పాటు స్కిల్స్‌ ఎంతో అవసరం. ప్రస్తుతం ఇంజనీరింగ్‌ కళాశాలల్లో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌,  టెక్నికల్‌ స్కిల్స్‌, హ్యూమన్‌ రిలేషన్‌ వంటి స్కిల్స్‌పై వివరిస్తున్నాం. వీటితో పాటు ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన విద్యార్థులు వారి గ్రూపులకు సంబంధించిన కంప్యూటర్‌ కోర్సులను నేర్చుకుంటే సులభంగా ఉద్యోగాలు సాధించవచ్చు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *