ఇంగ్లాండ్ విశ్వవిజేత

44 ఏళ్ల ఇంగ్లాండ్ నిరీక్షణ ఫలించింది, లార్డ్స్ మైదానంలో న్యూజీలాండ్ తో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో అదృష్టం కలిసొచ్చి గెలిచింది, అదే సందర్భంలో న్యూజిలాండ్ అదృష్టం కలిసిరాక ఓడింది అని చెప్పొచ్చు.

మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 241 పరుగులు చేసింది. చేసింగ్ కి దిగిన ఇంగ్లాండ్ మొదట్లో స్లో రన్ రేట్ తో మొదలు పెట్టింది. మధ్యలో కాస్త స్పీయేడు పెంచి గెలుపు వైపు వెళుతున్నట్టు కనిపించింది. కానీ వెనువెంటనే వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లో పడింది. కానీ వరల్డ్ కప్ వీరుడు స్టొక్స్ ఒంటరి పోరాటం చేసాడు. 50 వ ఓవర్ చివరి బంతి వరకు మ్యాచ్ సాగింది. చివరి బంతికి 2 పరుగులు చేయాల్సిన ఇంగ్లాండ్ కేవలం 1 పరుగు చేయడం తో మ్యాచ్ టై అయ్యింది.

సూపర్ ఓవర్:
చెరో 50 ఓవర్లు ఆడి, రెండు జట్లు కూడా 241 పరుగులు చేయడంతో టై అయిన మ్యాచ్, సూపర్ ఓవర్ తో డిసైడ్ చేయాల్సి వచ్చింది. సూపర్ ఓవర్లో మొదట బాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 15 పరుగులు చేసింది. సూపర్ ఓవర్ చేసింగ్ కి దిగిన న్యూజిలాండ్ కూడా 15 పరుగులే చేయడంతో, అత్యధిక బౌండరీలు సాధించిన ఇంగ్లాండ్ ను విశ్వవిజేతగా ప్రకటించారు. రెండు జట్లు కూడా హోరాహోరీగా పోరాడిన ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ని అదృష్టం గెలిపించింది అని చెప్పొచ్చు.

ఒకప్పుడు ప్రపంచంలో చాలా భాగాన్ని జయించిన ఇంగ్లాండ్, క్రికెట్ కి పుట్టినిల్లు అయిన ఇంగ్లాండ్, వరల్డ్ కప్ గెలవడానికి మాత్రం 44 సంవత్సరాలు పట్టింది. ఎన్నాళ్ళో వేచిన విజయాన్ని బ్రిటిష్ ప్రజలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *