దుమ్ము రేపుతున్న.. గుంటూరోడు

క్లాప్స్ & విజిల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రాకింగ్ స్టార్ మంచు మనోజ్ నటించిన చిత్రం గుంటూరోడు .. ఈ మద్య విడుదలైన ఈ చిత్రం మంచి కమర్షియల్ విజయాన్ని సాధించింది. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ని బాగా అలరిస్తూ బి సి సెంటర్స్ లో మనోజ్ కెరియర్లోనే మంచి వసూళ్ళు సాదిస్తుంది.

సినిమాల్లో దర్శకుడికి వుండే క్రేజ్ వేరు.. అలాంటి దర్శకుల్లో మాస్ దర్శకుడి గా పేరు తెచ్చు కోవాలంటే అంత ఆషామాషీ విషయం కాదు.. అలాంటిది తన రెండో చిత్రం తోనే మాస్ దర్శకుడిగా ఇండస్ట్రీ లో మంచి పేరు సంపాదించుకున్నారు దర్శకుడు యస్‌ కె సత్య.

ఈ చిత్రం లో అతని టేకింగ్ కి , డైలాగ్స్ కి , యాక్షన్ సన్నివేసాలకు ప్రేక్షకుల నుండి అద్బుతమైన రెస్పాన్సు వస్తుంది.. మనోజ్ ని ఎలాగైతే చూడాలని అభిమానులు, ప్రేక్షకులు, కుటుంబసబ్యులు కోరుకుంటున్నారో అలానే మాస్ హీరో గా మనోజ్ ని చూపించారు దర్శకుడు సత్య.. ఈ చిత్రం లో తండ్రి కొడుకుల సెంటిమెంట్ ని దర్శకుడు సత్య బాగా చూపించారు.. హీరో కి దీటుగా విలన్ పాత్రని తీర్చిదిద్దడంలో మంచి మార్కులు కొట్టేసాడు దర్శకుడు సత్య. ఈ చిత్రాన్ని చూసిన పరిశ్రమ ప్రముఖలు దర్శకుడు సత్య ని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.. కమర్షియల్ హీరోలు సత్య దర్సకత్వం లో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *