యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు గుడి కడుతున్నఫ్యాన్స్.. ఎక్కడో తెలుసా?

టాలీవుడ్‌లో అగ్రహీరోలందరూ విజయాన్ని అందుకోవడానికి కష్టపడుతుంటే, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. తాజాగా మూడు పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ఎన్టీఆర్.. జై లవకుశతో మరో విజయాన్నితన ఖాతాలో వేసుకొన్నాడు. బాక్సాఫీస్ వద్ద తన కెరీర్‌లోనే అత్యుత్తమ బ్లాక్ బస్టర్‌ను అందుకొన్నారు. నటనపరంగానే కాకుండా కలెక్షన్లపరంగా ఫ్యాన్స్‌ను మెప్పించిన ఎన్టీఆర్‌కు అరుదైన గౌరవం దక్కబోతున్నదట. ఎన్టీఆర్‌ను ప్రాణం కన్నా మిన్నగా అభిమానించే ఫ్యాన్స్ ఆయనకు గుడి కట్టబోతున్నారట.

ఇటీవల కాలంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ విజయ పరంపరను కొనసాగిస్తున్నాడు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ లాంటి చిత్రాలతో దూసుకెళ్తున్నాడు. ప్రతీ సినిమాతో ఫ్యాన్స్‌కు పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాడు.నాలుగు బ్లాక్ బస్టర్ విజయాలతో ఎన్టీఆర్‌కు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఇతర ప్రాంతాల్లో కూడా విపరీతమైన క్రేజ్ పెరిగిపోతున్నది. ఎన్టీఆర్ క్రేజ్‌కు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు సాక్ష్యంగా నిలిచాయి.

తెలుగు రాష్ట్రాలను పక్కన పెడితే కర్ణాటకలో కూడా ఎన్టీఆర్ మంచి ఫాలోయింగ్ ఉంది. ఎన్టీఆర్ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటారు. ఎన్టీఆర్ ఇటీవల ఓ కన్నడ చిత్రం కోసం పాడిన పాట అక్కడి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొన్నది.అలా కన్నడ ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించిన ఎన్టీఆర్‌కు ఇప్పడు అరుదైన గౌరవాన్ని కల్పించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. కన్నడ రాష్ట్రంలో ఎన్టీఆర్‌కు గుడి కట్టడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది.

ఎన్టీఆర్‌కు గుడి కట్టే విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కానీ సినీ వర్గాల్లో ఈ వార్త విస్తృతంగా ప్రచారం అవుతున్నది. త్వరలోనే దీనికి సంబంధించిన వివారాలను అభిమానులు ప్రకటిస్తారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేర్కొంటున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *