బ్లాక్ లిస్ట్ లోకి పాకిస్తాన్…

ఉగ్రవాదంపై తన వైఖరిని మార్చుకోని దాయాది దేశం పాకిస్థాన్‌కు ఆర్థిక చర్యల కార్యదళం ఆసియా-పసిఫిక్‌ గ్రూప్‌(ఎఫ్‌ఏటీఎఫ్‌-ఏపీజీ) భారీ షాక్‌ ఇచ్చింది. ఇప్పటి వరకు గ్రే లిస్ట్‌లో ఉన్న దాయాది దేశాన్ని బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చినట్టు శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు గత రెండు రోజులుగా ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలో జరుగుతున్న ఎఫ్‌ఏటీఎఫ్‌-ఏపీజీ సమావేశంలో నిర్ణయించినట్లు భారత అధికారులు తెలిపారు. ఉగ్రవాద నిర్మూలన దిశగా తీసుకుంటున్న చర్యలకు సంబంధించిన వివరాలను పాక్‌ ఇటీవల ఎఫ్‌ఏటీఎఫ్‌కి సమర్పించింది. పాక్‌ తీసుకున్న దాదాపు 40 రకాల చర్యల్లో దాదాపు 32 ఎఫ్‌ఏటీఎఫ్ నిబంధనలకు అనుగుణంగా లేవని ఆసియా-పసిఫిక్‌ గ్రూప్‌ కుండబద్దలు కొట్టింది. అలాగే ఉగ్రవాదులకు నిధుల చేరవేత, అక్రమ నగదు చలామణి లాంటి కీలకమైన 11 విషయాల్లో పాక్‌ 10అంశాల్లో లక్ష్యాల్ని చేరుకోలేదని స్పష్టం చేసింది. పాక్‌ను గ్రే లిస్ట్‌ లో పెట్టాలని ఎఫ్‌ఏటీఎఫ్‌ గత ఏడాది జూన్‌లో నిర్ణయించిన విషయం తెలిసిందే.

గతంలో గ్రే లిస్టులో ఉన్న పాకిస్తాన్‌ తాజాగా బ్లాక్‌లిస్ట్‌లోకి చేరడంతో అంతర్జాతీయ పరంగా ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొనుంది. కాగా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి ఆర్థిక సహాయం చేయడానికి ఇప్పటికే అనేక అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో నిధులు సమకూర్చుకునేందుకు అనేక దారులను అన్వేషిస్తున్న ఇమ్రాన్‌.. గత్యంతరం లేక ప్రభుత్వ ఆస్తులను సైతం అమ్మకానికి పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే దేశంలో జులాయిగా తిరుగుతున్న గాడిదలన్నింటినీ కంటైనర్లలో నింపి చైనాకు విక్రయించిన విషయం తెలిసిందే.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *