చివరికి ఒంటరైపోయిన క్రిష్

మణికర్ణిక ఓ మాదిరి వసూళ్ళతో 50 కోట్లు దాటేసిన తరుణంలో ముసురుకున్న వివాదాలు మాత్రం ఇంకా చల్లారడం లేదు. తాను తీసిన 70 శాతం సినిమానే తమదిగా చెప్పుకుని అన్యాయం చేసారని క్రిష్ వాపోతున్న తీరు మొదట్లో సానుభూతి తెచ్చినా క్రమంగా అది కంగనా వైపే మళ్ళుతోంది. తాజాగా మహిళా దర్శకురాలు నందిని రెడ్డి కంగనాకు అనుకూలంగా కామెంట్ చేయడం విశేషం.
ఒక దర్శకుడు వదిలేసిన ప్రాజెక్ట్ ని అదే ఫ్లో టెంపోతో నటిగా బాధ్యతలు మోస్తూనే కెప్టెన్ గా వ్యవహరించడం అంత సులభం కాదని అయినా కంగనా ఈ స్థాయి అవుట్ పుట్ తేవడం మెచ్చుకోవాలని చెప్పింది. మరో లేడీ డైరెక్టర్ సంజనా రెడ్డి మాట్లాడుతూ ఇంత రిస్క్ ని మోసి సినిమాను పూర్తి చేసిన కంగనా కష్టాన్ని అర్థం చేసుకోవాలని చెప్పడం గమనార్హం. వీళ్ళు మహిళలు కాబట్టి సానుభూతి ఉండటం సహజం అనుకున్నా దర్శకుడు అశోక్ కూడా రౌనత్ వైపే ఉన్నాడు.
ఒకవేళ క్రిష్ అలా బయటికి వచ్చినప్పుడే సమస్య తీవ్రంగా ఉందనిపిస్తే అప్పుడే దీని మీద పోరాటం చేయాల్సిందని ఇప్పుడు ఫలితం తెలిసాక తనకు అన్యాయం జరిగింది అని చెప్పుకోవడంలో అర్థం లేదని క్లారిటీ ఇచ్చారు. ఒక్కసారి మనం కాదు అనుకున్న సినిమాను నిందించే హక్కు ఉండదని చెప్పిన అశోక్ పది శాతం తీసినా కంగనా క్రిష్ స్టాండర్డ్ ని మ్యాచ్ చేసిందంటే ఒప్పుకోవాల్సిన విషయమే కాబట్టి క్రెడిట్ ఇవ్వాలని తేల్చి చెప్పాడు.
రెండు రోజుల క్రితం ఇదే విషయమై సమంతా ట్విట్టర్ లో కంగానాను సపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు నిన్న నిర్మాత కమల్ జైన్ క్రిష్ ని ఉద్దేశించి అంత కష్టంగా ఉంటే లీగల్ గా ఫైట్ చేయమని అంతేతప్ప ఇలా ట్విట్టర్ లో మీడియాలో బురద జల్లడం సరికాదని చెప్పడం మరో ట్విస్ట్. తనను ఇంతవాణ్ణి చేసిన తెలుగు పరిశ్రమ నుంచి ఎవరూ మద్దతు తెలుపని తరుణంలో క్రిష్ పూర్తిగా ఒంటరి వాడైపోయాడు. ఇక దానికి స్వస్తి చెప్పి కొత్త ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ పెట్టడం నయం.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *