ఫస్ట్ లుక్: సాహో డిజైన్ అదిరింది

ఇప్పుడు బాహుబలి ‘ప్రభాస్’ సాహో సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఈ కండలవీరుడి పుట్టినరోజు సందర్బంగా.. ఆ సినిమా తాలూకు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు యువి క్రియేషన్స్ వారు. పదండి అసలు ఈ లుక్ కథా కమామిషీ ఏంటో చూద్దాం.

ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్ ఒక మాఫియా డాన్ గా.. ఒక పోలీసుగా ద్విపాత్రాభినయం అంటూ బోలెడన్ని కతలు వింటున్నాం. అయితే ఈ సినిమాలో దర్శకుడు సుజిత్ ప్రభాస్ ను ఎలా చూపిస్తాడో తెలియదు కాని.. ఫస్ట్ లుక్ టీజర్ మరియు పోస్టర్లు మాత్రం అదర గొట్టేస్తున్నారు. ఏదో న్యూయార్క్ వంటి నగరంలోని ఆకాశ హర్మ్యాల మధ్యలో ముసుగు కట్టుకుని నడిచి వస్తున్న ప్రభాస్ ను చూస్తుంటే.. వావ్ అనిపిస్తుంది అంతే. అయితే ఇదంతా ఫోటోషాప్ లో డిజైన్ చేసిన విజువలైజర్ క్రెడిట్ అని అనిపిస్తున్నా కూడా.. అసలు ఈ సినిమా లుక్ ఎలా ఉండబోతుందో ఇప్పటికే ఒక అంచనాలకు వచ్చేయొచ్చు.

First-Look-Prabhas-In-Saaho
First-Look-Prabhas-In-Saaho

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రద్దా కపూర్ హీరోయిన్ గా చేస్తోంది. అలాగే వివిధ బాలీవుడ్ నటులు విలన్లుగా చేస్తున్నారు. మొత్తానికి పుట్టినరోజు నాడు అభిమానులకు మంచ ఊరటనిచ్చాడు ప్రభాస్. ఎనీవే.. హ్యాపీ బర్తడే బాహుబలి!!Prabhas, Saaho, First Look, Diwali, Prabhas Fans, Bollywood

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *