ఐఫోన్లపై ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్లు!

ఆపిల్ ఐఫోన్ ను డిస్కౌంట్ ధరల్లో కొనుకోవాలనుకుంటున్నారా? అయితే ఇదే సరియైన సమయమట. దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ తన ప్లాట్ ఫామ్ లో ఆపిల్ ఫెస్ట్ నిర్వహిస్తోంది. జనవరి 10 నుంచి 13 వరకు జరిగే ఈ ఫెస్ట్ లో ఐఫోన్లపై బంపర్ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది. ఐఫోన్లతో పాటు ఆపిల్ యాక్ససరీస్ పై కూడా డిస్కౌంట్లను ఈ సైట్ ప్రకటించింది. అదనంగా ఫ్లిప్ కార్ట్ లో ఐఫోన్ 6 కొనుకునే వారికి అన్ని డెబిట్, క్రెడిట్ కార్డులపై 5 శాతం డిస్కౌంట్ ఇస్తోంది.

ఆపిల్ ఐఫోన్ 7 : ఆపిల్ ఐఫోన్ 7(128జీబీ) జెట్ బ్లాక్ 7 శాతం డిస్కౌంట్ తో రూ.65వేలకే అందుబాటులో ఉంటుంది. ఎలాంటి చార్జీలు లేని ఈఎంఐ ప్లాన్ నెలకు రూ.5,147 చొప్పున చెల్లించే విధంగా అందుబాటులో ఉంది. రెగ్యులర్ ఈఎంఐ అయితే నెలకు రూ.3,152 చెల్లించాలని. ఎక్స్చేంజ్ పై రూ.5000 డిస్కౌంట్ తో పాటు అదనంగా ధరపై రూ.3000 తగ్గింపు ఉంది. అలా ఎక్స్చేంజ్ పై రూ.23వేల వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. అదే యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డు యూజర్లయితే అదనంగా మరో 5 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది.
ఐఫోన్ 7(32జీబీ) రోజ్ గోల్డ్ ఫోన్ అయితే 7 శాతం డిస్కౌంట్ కి రూ.55,000కు విక్రయించనున్నారు. ఎలాంటి ఈఎంఐ ఛార్జీలు లేవు. ఎక్స్చేంజ్ పై రూ.23వేల డిస్కౌంట్. అదనంగా రెగ్యులర్ ఎక్స్చేంజ్ వాల్యుకి రూ.3,000 డిస్కౌంట్. యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డు యూజర్లు అదనంగా 5 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. 128 జీబీ ఆపిల్ ఐఫోన్ 7 రోజ్ గోల్డ్ వేరియంట్ ను రూ.65,000కే విక్రయించనున్నారు. 6 శాతం డిస్కౌంట్ తో ఐఫోన్7(256 జీబీ) జెట్ బ్లాక్ ఆప్షన్ మోడల్ ను రూ.75,000కు ఆపిల్ విక్రయించనుంది..
ఐఫోన్ 7 ప్లస్ : ఆపిల్ ఐఫోన్ 7 ప్లస్(128జీబీ) జెట్ బ్లాక్ ఆప్షన్ ను రూ.82వేలకే కొనుగోలు చేసుకోవచ్చు. అదనంగా దీనిపై రూ.23వేల వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ ఉంది. రెగ్యులర్ ఎక్స్చేంజ్ వాల్యుపై మరో రూ.3వేలు డిస్కౌంట్ ఇవ్వనున్నారు. యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డుదారులకి 5 శాతం అదనపు ప్రయోజనం చేకూరనుంది. ఆపిల్ ఐఫోన్ 7 ప్లస్(128జీబీ) రోజ్ గోల్డ్ ఆప్షన్ ను కూడా రూ.82వేలకే లభ్యం కానుంది. జెట్ బ్లాక్ రంగులో ఇతర వేరియంట్లు 258 జీబీ వేరియంట్ ధర రూ.92వేలు. ఐఫోన్ 7 ప్లస్128జీబీ) జెట్ బ్లాక్ ఆప్షన్ కు ఇచ్చిన డిస్కౌంట్ ఆఫర్లనే ఈ ఫోన్ కు ఫ్లిప్ కార్ట్ లో అందిస్తున్నారు.
ఐఫోన్ 6 ఎస్ : ఆపిల్ ఐఫోన్6(16జీబీ) స్పేస్ గ్రే వేరియంట్ రూ.31,990కు కొనుకోవచ్చు. ఎక్స్చేంజ్ పై రూ.24వేల వరకు డిస్కౌంట్ ఉంది. అదనంగా రెగ్యులర్ ఎక్స్చేంజ్ వాల్యుపై రూ.4,000 డిస్కౌంట్ ను అందిస్తున్నారు. ఈఎంఐ రూ.1,552కే ప్రారంభమవుతుంది. ఆపిల్ 6ఎస్(32జీబీ) స్పేస్ గ్రే, రోజ్ గోల్డ్ కలర్స్ వేరియంట్లు  రూ.46,999కు లభ్యం కానున్నాయి.. ఎక్స్చేంజ్ పై రూ.23వేల వరకు డిస్కౌంట్, అదనంగా రెగ్యులర్ ఎక్స్చేంజ్ వాల్యుపై రూ.3000 తగ్గింపు పొందవచ్చు. అదే యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డు యూజర్లయితే అదనంగా మరో 5 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది.
ఆపిల్ ఐఫోన్ 6ఎస్ ప్లస్: (32జీబీ) సిల్వర్, రోజ్ గోల్డ్ ఫోన్లు రూ.56,999కు అందుబాటులో ఉండనున్నాయి. ఎక్స్చేంజ్ పై రూ.23వేల డిస్కౌంట్, అదనంగా రెగ్యులర్ ఎక్స్చేంజ్ వాల్యుపై రూ.3,000 డిస్కౌంట్ ను అందిస్తున్నారు. యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డు యూజర్లందరికీ అదనంగా మరో 5 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది.
ఆపిల్ ఐఫోన్ 5ఎస్ :
దేశంలో ఎక్కువగా పాపులర్ అయిన ఈ మోడల్ 16 జీబీ సిల్వర్, స్పేస్ గ్రే రంగు వేరియంట్ రూ.19,999కు ఆపిల్ అందించనుంది. ఎక్స్చేంజ్ పై రూ.15వేల వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నారు.
ఆపిల్ యాక్ససరీస్, కీబోర్డులు, మౌస్ వంటి వాటిపై ఫ్లాట్ డిస్కౌంట్ 50, 25 శాతం ఆఫర్ చేస్తున్నారు.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *