నేటి అర్థరాత్రి నుంచే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్

ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ దసరా పండుగను పురస్కరించుకుని ‘ది బిగ్ బిలియన్ డేస్’ పేరిట ఓ ప్రత్యేకమైన సేల్‌ను ఇవాళ అర్థరాత్రి నుంచి ప్రారంభించనుంది. ఈ నెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగుతుంది. కాగా సేల్‌లో భాగంగా అనేక ఉత్పత్తులపై రాయితీలు, ఆఫర్లు లభిస్తున్నాయి.

ఎస్‌బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డును వాడి ఉత్పత్తులను కొనుగోలు చేస్తే 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇక ఈ సేల్‌లో భాగంగా శాంసంగ్‌కు చెందిన గెలాక్సీ ఎస్7 స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.29,990 ధరకే లభించనుంది. అలాగే హానర్ 6ఎక్స్, హానర్ 8 ప్రొలపై పలు ప్రత్యేకమైన డీల్స్ అందుబాటులో ఉండనున్నాయి. అదేవిధంగా దాదాపుగా అన్ని రకాల దుస్తులపై 50 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తున్నది. దీంతోపాటు టీవీలు, ఫ్రిజ్‌లు, ఏసీలు, వాషింగ్ మెషిన్లు తదితర ఉత్పత్తులపై 70 శాతం వరకు రాయితీలు లభించనున్నాయి. ఇక గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై ఏకంగా 50 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తున్నది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *