సినీ, టీవీ కళాకారుల అభివృద్ధికి ….

తెలంగాణ  రాష్ట్రంలోని సినీ, టీవీ కళాకారులకు ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. ఇందుకోసం శంషాబాద్‌ పరిసరాల్లో 10 ఎకరాల భూమిని సేకరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కళాకారులకు ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌, కల్చరల్‌ సెంటర్‌, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం కోసం కూడా సాధ్యమైన చోట స్థలం సేకరించాలన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో సీనియర్‌ నటులు చిరంజీవి, నాగార్జునతో కలిసి పలు శాఖల అధికారులతో సమావేశమయ్యారు. సినీ, టీవీ కళాకారుల అభివృద్ధికి ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. సింగిల్‌ విండో విధానం ద్వారా షూటింగ్‌లకు త్వరితగతిన అనుమతులు వచ్చేలా చూస్తామని, పైరసీ నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకునేలా ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. చలనచిత్ర అభివృద్ధి కార్పొరేషన్‌ (ఎఫ్‌డీసీ) ద్వారా కళాకారులకు త్వరలో గుర్తింపు కార్డులు అందజేస్తామన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *