మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు నిఖిల్‌ కుమార్‌ నిశ్చితార్థానికి..

బెంగళూరు : రాజకీయ విభేదాలకు అతీతంగా జేడీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు నిఖిల్‌ కుమార్‌ నిశ్చితార్థానికి కాంగ్రెస్‌ నేత డి.కె.శివకుమార్‌ దంపతులు అభినందించారు. నిత్యం రాజకీయంగా పరస్పరం విమర్శలు చేసుకునే సీఎం యడియూరప్ప, మాజీ సీఎం కుమారస్వామిలు ఒకరినొకరు కరచాలనం చేసుకుని నవ్వుతూ పలకరించుకున్నారు. పార్టీలకు అతీతంగా నాయకులు హాజరయ్యారు. మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్‌, రేవతి తల్లిదండ్రులు సంప్రదాయబద్ధంగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దేవేగౌడ దంపతులతోపాటు మాజీ మంత్రి రేవణ్ణ కుటుంబ సభ్యులు భాగస్వామ్యులయ్యారు. మంత్రులు శెట్టర్‌, ఆర్‌.అశోక్‌, బసవరాజ్‌ బొమ్మైలు సహా పలువురు పాల్గొన్నారు. సినిమా రంగానికి చెందిన నిర్మాతలు, దర్శకులు నటులు పాల్గొన్నారు. అభిమానులకోసం ఎంగేజ్‌మెంట్‌ కేక్‌ను నిఖిల్‌, రేవతిలు కట్‌ చేశారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *