గ్రహణమొర్రి, కాలినగాయాల వారికి ఉచిత శస్త్ర చికిత్సలు

హైదరాబాద్: గ్రహణమొర్రి వ్యాధితో బాధపడుతున్న వారికి శుభవార్త. లయన్స్‌ క్లబ్‌ హైదరాబాద్‌(గ్రీన్‌లాండ్స్‌), కిమ్స్‌ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 27వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఉచిత శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నట్లు సంయుక్త ప్రతినిధులు పి.మధుకర్‌స్వామి, విద్యాభూషణ్‌ ఆదివారం ప్రకటనలో తెలిపారు. కిమ్స్‌ దవాఖాన సీఈవో అండ్‌ ఎండీ భాస్కర రావు, హెచ్‌ఓడీ ప్లాస్టిక్‌ సర్జరీ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ హేమలత పర్యవేక్షణలో డాక్టర్‌ సుదర్శన్‌రెడ్డి, ఆమెరికాకు చెందిన ఆరుగురు వైద్యులతో శస్త్రచికిత్సలు జరుగుతాయని పేర్కొన్నారు. గ్రహణమొర్రి, కాలినగాయాలతో బాధపడే వారు ఈ ఉచిత శస్త్రచికిత్సలను సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. ఈనెల 21వ తేదీ నుంచి 24వ వరకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఉంటుందని, 25, 26వ తేదీల్లో స్క్రీనింగ్‌, శస్త్ర చికిత్సల తేదీలు ఖరారు చేస్తామని చెప్పారు. ఉచిత శస్త్ర చికిత్సల కోసం మరిన్ని వివరాలకు ఫోన్‌ నంబరు 9866079845ను సంప్రదించాలని సూచించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *