దేశ చరిత్రను మార్చేలా.. సంచలన నిర్ణయం తీసుకున్న సౌదీరాజు

రాచరిక పాలనలో ఆనవాయితీగా వస్తున్న వారసత్వాన్ని కొనసాగించేందుకు సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన తర్వాత తన వారసుడిగా సౌదీని పాలించబోయే రాజును ప్రకటించారు. తన కొడుకు అయిన  మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్‌ను సౌదీకి కాబోయే రాజుగా నిర్ణయించి అధికారిక ప్రకటనను విడుదల చేశారు. 1985 ఆగస్టు 31వ తారీఖున జన్మించిన మహ్మద్ బిన్.. ప్రస్తుతం రక్షణ శాఖ మంత్రిత్వ శాఖను నిర్వర్తిస్తున్నారు. ప్రపంచంలో దేశ రక్షణ శాఖ మంత్రిగా ఉన్న అత్యంత పిన్న వయస్కుడు ఆయనే కావడం విశేషం. మూడో భార్య ఫహ్దా బిండ్ ఫలాహ్ బిన్ సుల్తాన్ కొడుకు అయిన మహ్మద్ బిన్.. 2009 డిసెంబర్ 15న సౌదీ రాజకీయాల్లోకి ప్రవేశించారు. సౌదీకి కాబోయే రాజుగా, ఉపప్రధానిగా మహ్మద్ బిన్ పేరును ప్రతిపాదిస్తూ బుధవారం సౌదీ రాజు సల్మాన్ ప్రకటించడంతో దేశ వ్యాప్తంగా ఆనందోత్సాహాలు మిన్నంటాయి. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సౌదీ పర్యటనలో ఆసాంతం అన్నీ తానై నడిపించినందుకు, తన సమర్థతను నిరూపించుకున్నందుకు ఈ ప్రకటన వెలువడి ఉంటుందని సౌదీ ప్రజలు భావిస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *