గద్దలకొండ గణేశ్(వాల్మీకి) మూవీ రివ్యూ…

మెగా హీరో వరుణ తేజ్ నటించిన సినిమా ‘గద్దలకొండ గణేశ్’. మొదట వాల్మీకి గా వచ్చిన చివరి నిముషంలో కోర్టు ఆదేశాల మేరకు సినిమా పేరును మార్చారు. ఈ ఏడాది ఎఫ్‌2 చిత్రంతో భారీ హిట్టు కొట్టిన వరుణ్‌.. మరో సక్సెస్‌ సాధించి ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు ఓ తమిళ రీమేక్‌తో వచ్చాడు. రీమేక్‌ స్పెషలిస్ట్‌ హరీష్ శంకర్‌.. తమిళ సినిమా జిగర్తాండను ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు గద్దల కొండ గణేష్ ని మలిచాడు.  మరి ఈ చిత్రం వరుణ్ కి విజయం సాధించిందా? లేదా?

valmikiకథ:

అభి(అథర్వ) దర్శకుడు కావాలని ప్రయత్నిస్తుంటాడు. రియలిస్టిక్ గా ఉండటానికి ప్రస్తుయమ్ ఫామ్ లో ఉన్న గ్యాంగ్ స్టార్ కోసం వెతుకుతుంటారు. అప్పుడే అతనికి గద్దలకొండ గణేష్ (వరుణ్‌ తేజ్‌) గురించి తెలుస్తుంది. అతనిపైనే సినిమా తీయాలని ఫిక్స్ అవుతాడు. అయితే అతనికి ఎదురు తిరిగే వారిని అతని గురించి ఆరా తీసేవారిని గణేష్ చంపుతూ ఉంటాడు. మరి గణేష్కు అభి ఎలా దగ్గెరయ్యాడు.. అతనితో కలిసి సినిమాను ఎలా తెరకెక్కించాడు.. అందుకోసం అభి పడిన పాట్లు ఏమిటి? ఆ జర్నీలో గద్దలకొండ గణేష్‌ మారిపోయాడా? అన్నదే మిగతా కథ.

 

gaddalakonda geneshవిశ్లేషణ:

ఈ సినిమాకు కథే ముఖ్యం. అయితే ఈ కథ ఇక్కడ పుట్టింది కాదు. తమిళ నాట సూపర్‌ హిట్‌గా నిలిచిన జిగర్తాండ చిత్రానిది ఈ కథ. టైటిల్‌ క్రెడిట్స్‌ లో కథా రచయిత కార్తీక్‌ సుబ్బరాజు వేయడంతోనే ఈ కథకు ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలుస్తోంది. అయితే మన తెలుగు ప్రేక్షకులకు అంచనాలకు తగ్గట్టు తీయడం హరీష్‌ శంకర్‌ సక్సెస్‌ అయ్యాడనే చెప్పవచ్చు. తెలుగులో వరుణ్‌కు ఉన్న ఇమేజ్‌ దృష్ట్యా కథలో కొన్ని మార్పులు చేశారు. సినిమాను ఆద్యంతం వినోదభరితంగా తెరకెక్కించిన హరీష్‌.. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నట్లే కనిపిస్తోంది. ఇక గద్దలకొండ గణేష్‌ పాత్రలో వరుణ్‌ తేజ్‌ జీవించాడు. సినిమా అంతా తన భుజాలపైనే మోశాడు. నవ్వించడమే కాదు.. ఏడ్పించేశాడు. నటుడిగా మరో మెట్టు ఎక్కాడని ఈ చిత్రంతో మరోసారి చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా అభి పాత్ర గురించి చెప్పుకోవాలి. తమిళ హీరో ఆ క్యారెక్టర్‌ను పోషించడంతో.. తెలుగు ప్రేక్షకులకు అంతగా అంచనాలు ఉండవు. అయితే అథర్వా అభి పాత్రకు చక్కగా సరిపోయాడు. పూజా హెగ్డే ఉన్నంతలో ఆకట్టుకుంది. శ్రీదేవీ పాత్రలో అందంతో అందర్నీ కట్టిపడేసింది. ఈ చిత్రానికి సంబంధించి తరువాత చెప్పుకోవల్సింది మిక్కీ జే మేయర్‌. పాటలే కాదు.. బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా అదిరిపోయింది. గద్దలకొండ గణేష్‌ పాత్ర అంతగా పండిందంటే.. మిక్కీ అందించిన నేపథ్య సంగీతం కూడా అందుకు ఓ కారణం. ఎడిటింగ్‌, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్: కథ, వరుణ్ తేజ్, సంగీతం

నెగెటివ్ పాయింట్స్: కథలో చేసిన మార్పులు

టైటిల్: గద్దలకొండ గణేష్‌ (వాల్మీకి)

తారాగణం: వరుణ్‌ తేజ్‌, అథర్వా, పూజా హెగ్డే, మృణాళిని రవి, బ్రహ్మాజి, తణికెళ్ల భరణి తదితరులు

సమర్పణ: 14 రీల్స్ ప్లస్ బ్యానర్

దర్శకత్వం:  హరీష్‌ శంకర్‌

సంగీతం: మిక్కీ జే మేయర్‌

నిర్మాత: రామ్‌ ఆచంట, గోపి ఆచంట

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *