గ్యాంగ్ లీడర్ కు కష్టమోచ్చిందా…

నేచురల్ స్టార్ నాని నటిస్తున్నగ్యాంగ్ లీడర్ చిత్రానికి పెద్ద కష్టం వచ్చిపడింది. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సాహో సినిమా విడుదల వాయిదా పడుతుందన్న టాక్ వినిపిస్తుంది. అసలు సాహో ఆగష్టు 15వ తేదిన విడుదల కావాల్సి ఉండగా 30న రిలీజ్ అవుతుందని ప్రచారం జరగుతుంది. ఒకవేళ అది నిజమైతే గ్యాంగ్ లీడర్ కు ఇబ్బందులు తప్పవు.

దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రయూనిట్ ఈ సినిమాన్ని ఆగష్టు 30వ తేదిన విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఇప్పుడు గ్యాంగ్ లీడర్ కూడా వాయిదా పడే అవకాశం ఉంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *