గంగూలీ కూతురి ఫొటోషూట్‌.. హల్‌చల్‌!

సెలబ్రిటీ కిడ్స్‌ సోషల్‌ మీడియాలో దుమారం రేపడం కొత్త కాదు. ఇప్పటికే శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌, సైఫ్‌ అలీఖాన్‌ కూతురు సరా అలీఖాన్‌ తమ ఫొటోలు, అప్‌డేట్స్‌తో ఇంటర్నెట్‌ను ఓ కుదుపు కుదిపారు. ఇప్పుడు మరో సెలబ్రిటీ కిడ్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఆమెనే సనా గంగూలీ. భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్‌ గంగూలీ గారాలపట్టీ. చిన్నారిగా అప్పుడప్పుడు తండ్రి గంగూలీతో కలిసి ఫొటోలలో కనిపించిన సనా ఇప్పుడు పెరిగి పెద్దదైంది.

16 ఏళ్ల ఈ అందాల భరిణ ఇప్పుడు తండ్రి గంగూలీతో కలిసి దిగిన ఓ ఫొటోషూట్‌తో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.  ఓ ప్రీమియం జ్యువెల్లరీ బ్రాండ్‌ కోసం గంగూలీ, సనా కలిసి ఈ ప్రత్యేక ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. బంగారు అంచు కలిగిన గులాబీవర్ణం చీరను కట్టుకొని ఈ ఫొటోలలో ముగ్ధమోహనంగా సనా దర్శనమిచ్చింది. తండ్రి గంగూలీ, తల్లి డొనా ఈ ఫొటోలను తమ ఫేస్‌బుక్‌ పేజీలలో షేర్‌ చేసుకున్నారు. కెమెరా ముందు ఏ మాత్రం బెరుకులేకుండా కనిపించిన సనా ఈ ఫొటోలలో అద్భుతంగా ఉందని నెటిజన్లు కితాబిస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *