అఫ్రిది నీకు అసలు బుర్ర ఉందా : గంభీర్

నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వద్దకెళ్లి శాంతి పతాకం ఎగరేస్తానన్న పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిదిపై టీమిండియా మాజీ క్రికెటర్‌, ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ తీవ్ర విమర్శలు చేశాడు. అతడికి వయసు, బుర్ర పెరగలేదని పేర్కొన్నాడు. కొందరు మనుషులకు తాము ఏం మాట్లాడుతున్నామో అర్థంకాదని వ్యంగ్యంగా అన్నాడు.  కొంతమంది బుర్రలు ఎప్పటికీ ఎదగవు. అంతర్జాతీయ క్రికెట్‌ ఆడినా వారి బుర్ర మాత్రం పెరగడం లేదు. ఆయన బుర్ర ఎప్పటికీ ఎదగదు. ఆయన ప్రతీది రాజకీయం చేయాలనుకుంటున్నారు. అలా అయితే ఆయన రాజకీయాల్లోకి ఎందుకు రావడం లేదు. ఒకవేళ  రాజకీయాల్లోకి వచ్చినా ప్రజలతో.. మానసిక పరిపక్వత గత వ్యక్తిలా మాట్లాడాలి  అంటూ అఫ్రీదికి పరోక్షంగా చురకలు అంటించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *