కూతురి బౌలింగ్‌.. గంభీర్‌ బ్యాటింగ్‌.. వైరల్‌ వీడియో

అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌లోఎంతో మంది బౌలర్లను సునాయసంగా ఎదుర్కొన్నాడు టీమిండియా క్రికెటర్‌ గౌతం గంభీర్‌. తమకు అర్థంకాని బౌలర్లు అంటూ తలలు పట్టుకున్న బ్యాట్స్‌మెన్లకు చిట్కాలు చెప్పిన సందర్భాలు లేకపోలేదు. అలాంటిది ఓ చిన్ని బౌలర్‌ బంతులను ఎదుర్కొనేందుకు చాలా ఒత్తిడిగా ఫీలయ్యానంటూ గంభీర్‌ చేసిన వీడియో ట్వీట్‌ వైరల్‌ అయింది.

గంభీర్‌ నాలుగేళ్ల కూతురు ఆజీన్‌ చదువుతోన్న పాఠశాలలో ఇటీవల ఓ ఈవెంట్‌ నిర్వహించగా, ప్రత్యేక అతిథిగా గంభీర్‌ పాల్గొన్నారు. చిన్నారుల బౌలింగ్‌లో బ్యాటింగ్‌ చేసి వారిని సంతోషపెట్టాలని చూశాడు గంభీర్‌. ఐతే స్కూలు యాజమాన్యం గంభీర్‌ కూతురు ఆజీన్‌ చేతికి బంతినందించారు. కూతురు వేసిన బంతిని గంభీర్‌ ఎంతో ఒత్తిడిలో ఆడినట్లు వెల్లడిస్తూ ఓ వీడియో పోస్ట్‌ చేశాడు. ‘నాకు ఔట్‌ సైడ్‌ ది ఆఫ్‌ స్టంప్‌ వేయాలని నా కూతురు ఆజీన్‌కు తెలుసు. ఆజీన్‌ బౌలింగ్‌ ఆడటానికి ఎంతో ఒత్తిడికి లోనయ్యాను’ అంటూ గంభీర్‌ చేసిన వీడియో ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *