ట్రైలర్ టాక్ః శాతకర్ణి..”దేశం మీసం తిప్పుద్దాం”

ఒక రాజుల కాలం నాటి సినిమాను తీయాలంటే.. మామూలుగా ఏళ్ళ తరబడి టైమ్ పడుతోంది. కాని ఒక అద్బుతమైన కథతో పాటు ఒక హార్డ్ వర్క్ చేసే నటుడు.. ఒక క్రియేటివ్ డైరక్టర్.. ఒక కత్తిలాంటి టీమ్ దొరికితే.. ఎలా ఉంటుంది? అదిగో ”గౌతమీపుత్ర శాతకర్ణి” ట్రైలర్ లా ఉంటుంది.

అనువణువూ రోమాలు నిక్కపొడిచే విజువల్స్ తో.. నటసింహం నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపంతో.. గంభీరమైన ఆయన స్వరం నుండి వినబడే మాటల మాయాజలాం.. వహ్వా అనిపించే రేంజులో క్రిష్ తీసిన అద్భుతం.. శాతకర్ణి. ఈ ట్రైలర్ వర్ణణాతీతం అంటే చాలా చిన్నమాటేమో. వార్ ఎపిసోడ్స్ నుండి.. రొమాంటిక్ సీన్స్ వరకు.. సెంటిమెంట్ నుండి ఉద్రేకం వరకు.. చాలా అద్భతంగా ఉందీ ట్రైలర్. నూతనంగా నిర్మాణపైన భారత రాజ్యాన్ని పరాయి దేశస్తుల నెత్తుటితో ప్రక్షాళన చేద్దాం.. అంటూ బాలయ్య అంటుంటే.. నిజంగానే వెంట్రుకలు నిక్కపొడుచుకున్నాయ్. ”దేశం మీసం తిప్పుద్దాం” అంటూ తెలుగు సినిమా స్థాయిని పెంచే వైవిద్యభరితమైన వీరగాధ.. గౌతమీపుత్ర శాతకర్ణి.

క్రియేటివ్ డైరక్టర్ క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ”గౌతమీపుత్ర శాతకర్ణి” సినిమా సంక్రాంతి కానుకగా విడుదలవ్వనుంది. అసలు ఇంత స్పీడు ఒక గ్రాఫిక్స్ సినిమాను రూపొందించడం.. దానిని రిలీజ్ కు రెడీ చేయడం అనేదే నిజంగానే అద్భుతమైన హార్డ్ వర్క్ అని చెప్పాలి. అందుకు మనం క్రిష్ ను అభినందించాల్సిందే.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *