గీత గోవిందం 3 రోజుల కలెక్షన్లు

ఇప్పుడు యూత్ తో పాటు ఫ్యామిలీస్ అన్ని ఏకగ్రీవంగా ఓటు వేస్తున్న సినిమా గీత గోవిందం. లవ్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు పరశురామ్ దీన్ని తీర్చిదిద్దిన తీరుకి వసూళ్లు దుమ్ము దులుపుతున్నాయి. అర్జున్ రెడ్డిని క్రాస్ చేస్తుందా లేదా అనేది పక్కన పెడితే ఆ దిశగా అయితే ప్రస్తుతం చాలా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఓవర్ సీస్ లో   చూస్తే మిలియన్ మార్కుకు అతి దగ్గరలో ఉన్న గీత గోవిందులు ఈ  రెండు రోజుల్లో దాన్ని ఈజీగా దాటేసేలా ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే మొదటి మూడు  రోజులకే 13 కోట్ల  షేర్ దాటేసి ఆమ్మో అనిపించిన ఈ మూవీ వీక్ ఎండ్ ని బాగా పిండేస్తోంది. ఇప్పుడు శనివారం, ఆదివారం అన్ని థియేటర్లలో షాకింగ్ ఫిగర్స్ నమోదయ్యేలా ఉన్నాయి. కేవలం 14-16 కోట్ల రీజనబుల్ బడ్జెట్ లో తెరకెక్కిన గీత గోవిందం ఐదే రోజుల్లో అదంతా వెనక్కు ఇవ్వడంతో పాటు లాభాలు కూడా మొదలుపెట్టడం అంటే బ్లాక్ బస్టర్ రేంజ్ అని చెప్పక తప్పదు.

ఆరెక్స్ 100 సక్సెస్ అయినా అది కేవలం యూత్ ని టార్గెట్ చేసిన మూవీ కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ దానికి దూరంగా ఉన్నారు. కానీ గీత గోవిందం కేసు వేరు. అందుకే టికెట్ కౌంటర్లు కళకళలాడుతూ ఉన్నాయి. నిన్న విడుదలైన ఒకే ఒక్క  డబ్బింగ్ సినిమా ఝాన్సీని కనీసం పట్టించుకునే వారు కూడా లేరు. మరో పక్క వచ్చే వారం రానున్న నీవెవరో, ఆటగాళ్లు దీని ధాటికి నిలవడం కష్టంగానే ఉంది. థియేటర్లు దొరకటం కూడా డౌట్ అనే నేపధ్యంలో ఏదో ఒకటి వాయిదా పడే అవకాశాలు కొట్టి పారేయలేం. నిన్నటి నుంచి చాలా చోట్ల థియేటర్లు పెంచేశారు. శైలజారెడ్డి అల్లుడు 31న వస్తుంది. దానికి ఇంకా పన్నెండు రోజుల టైం ఉంది. ఈ నేపధ్యంలో గీత గోవిందంలకు బ్రేక్ పడే అవకాశం మచ్చుకు కూడా కనిపించడం లేదు. ఏరియాల వారీగా వసూళ్లు ఈ విధంగా ఉన్నాయి

నైజామ్ – 5 కోట్లు

వైజాగ్ – 1 కోటి 34 లక్షలు

సీడెడ్ – 2 కోట్ల 1 లక్ష

ఈస్ట్ గోదావరి – 1 కోటి 9 లక్షలు

వెస్ట్ గోదావరి – 97 లక్షలు

కృష్ణా – 1 కోటి 4 లక్షలు

గుంటూరు – 1 కోటి 20 లక్షలు

నెల్లూరు – 44 లక్షలు

తెలుగు రాష్ట్రాల 3 రోజుల షేర్ – 13 కోట్ల 1 లక్ష

కర్ణాటక – 1 కోటి 4 లక్షలు

తమిళనాడు – 98 లక్షలు

ఓవర్ సీస్ – 3 కోట్ల 1 లక్ష

మొత్తం 3 రోజుల ప్రపంచవ్యాప్త షేర్ – 18 కోట్ల 12 లక్షల రూపాయలు

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *