టీఆర్ఎస్ కార్పోరేటర్ హేమలతకు ఝలక్: రూ.10వేల జరిమానా

హైదరాబాద్: బన్సీలాల్ పేట తెరాస కార్పోరేటర్ హేమలతకు గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ జరిమానా విధించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆమెకు రూ.10 వేల జరిమానా విధించింది. బన్సీలాల్ పేటలో ఓ ప్రారంభోత్సవానికి పలువురు మంత్రులు వస్తున్నారు. అయితే మంత్రుల రాక సందర్భంగా స్వాగతం పలుకుతూ తమ పేరుతో కార్పోరేటర్ హేమలత నిబంధనలకు విరుద్ధంగా బ్యానర్లు ఏర్పాటు చేశారు. దీంతో ఆమెకు జిహెచ్ఎంసి అధికారులు జరిమానా విధించారు.

లక్ష మందికి ఉపాధి అవకాశం:

కేటీఆర్‌ వరంగల్‌లో ఇప్పటికే 50 ఎకరాల్లో ఐటీ పార్క్‌ ఏర్పాటు చేశామని, అందులో నాలుగు పరిశ్రమలు ఉన్నాయని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శుక్రవారం తెలిపారు.

శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. మెగా టెక్స్‌టైల్‌ పార్క్ కోసం 1200 ఎకరాలు సేకరించామన్నారు. దీని దాదాపు లక్షమందికి ఉపాధి అవకాశాలు వస్తాయని అంచనా వెశామన్నారు. ఇందులో మహిళలకు పెద్దఎత్తున ఉపాధి దొరుకుతుందన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *